నారద వర్తమాన సమాచారం
ఏపీలోని చేతివృత్తుల వారికి ప్రభుత్వం శుభవార్త కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పీఎం విశ్వకర్మ యోజనతో ఆదరణ పథకాన్ని అనుసంధానం చేసి అమలుచేయాలని అధికారులు చర్చ….చెప్పింది.
కులవృత్తులను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఆదరణ పథకాన్ని మళ్లీ అమలుచేయాలని నిర్ణయించింది.
అయితే కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పీఎం విశ్వకర్మ యోజనతో ఆదరణ పథకాన్ని అనుసంధానం చేసి అమలుచేయాలని అధికారులు ఆలోచిస్తున్నారు.
ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కేంద్రం అమలు చేస్తున్న పీఎం విశ్వకర్మ యోజన కింద ఎంపికైన వారికి 2 విడతల్లో రూ.3 లక్షలు రుణం అందిస్తారు. ఈ రుణానికి 13 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇందులో 8 శాతం వడ్డీని కేంద్రం భరిస్తుండగా..మిగిలిన ఐదుశాతాన్ని లబ్ధిదారులు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ పీఎం విశ్వకర్మ యోజనకు ఆదరణ పథకాన్ని లింక్ చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఆదరణ- విశ్వకర్మ యోజనగా దీనికి పేరు పెట్టాలనే ఆలోచనలో ఉన్నారు.మరోవైపు పీఎం విశ్వకర్మ యోజన కింద పరికరాల కొనుగోలుకు 15 వేల రూపాయలు అందిస్తున్నారు. అలాగే ట్రైనింగ్ కోసం నాలుగు వేలు ఇస్తున్నారు. అయితే ఆదరణ- విశ్వకర్మ యోజన కింద.. ఈ మొత్తానికి తన వాటా కింద అదనంగా మరికొంత అందించేలా రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేస్తోంది. అలాగే ఈ పథకం కింద ఎంపిక చేసినవారికి వడ్డీ లేకుండా రూ.3 లక్షలు అందించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. 13 శాతం వడ్డీలో 8 శాతం కేంద్రం, 5 శాతం లబ్ధిదారులు చెల్లిస్తుండగా.. లబ్ధిదారులు చెల్లించే ఐదుశాతం వడ్డీని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అలాగే మూడు లక్షల రుణంలోనూ కొంత మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించేలా బీసీ సంక్షేమ శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఆ రకంగా మొత్తం రూ.3 లక్షల రుణాన్ని సున్నా వడ్డీకే అందించేలా ప్లాన్ చేస్తున్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.