నారద వర్తమాన సమాచారం
బిసి-ఏ గ్రూపులోని సంచార – విముక్తి జాతుల్ని ఆర్థికంగా ఆదుకోవాలి.
కేసన శంకరరావు
వెనుకబడిన తరగతుల్లో, అట్టడుగునున్న సంచార-విముక్తి జాతుల వారు 42 కులాలుగా బీసీ-ఏ గ్రూపులో ఉన్నారని,వారిని ఆర్థికంగా ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కేసన శంకరరావు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. స్థానిక పిడుగురాళ్ల బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో బీసీ-ఏ గ్రూప్ కుల సంఘ నాయకులతో జరిగిన మీటింగ్ లో వారు మాట్లాడుతూ, ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ బీసీల సమగ్రాభివృద్ధికి మంచి పథకాల రూపకల్పనకు మాత్రం పూనుకోవడం లేదన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం జాతీయ వెనుకబడిన తరగతుల ఆర్థిక అభివృద్ధి సంస్థ (ఎన్.బి.సి.ఎఫ్.డి.సి) ద్వారా వివిధ రాష్ట్రాలలోని బిసి-ఏ కులాల వారికి 10 నుండి 20 మంది సభ్యులు ఉన్న గ్రూపులుగా ఏర్పడితే, ఒక్కొక్క గ్రూపుకు ముందుగా పదివేల రూపాయలు ఉచితంగా ఇవ్వడంతో పాటు, 25 వేల నుండి లక్ష రూపాయల వరకు రుణ సదుపాయాన్ని కల్పిస్తుందన్నారు. రూ 10 వేలు ఖర్చు చేసి నైపుణ్య శిక్షణ ఇప్పించడంతోపాటు, కేంద్ర బీసీ ఆర్థిక సంస్థ బ్యాంకుల ద్వారా ఇప్పిస్తున్న రుణంలో 50 శాతం సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందన్నారు.
ఈ పథకాన్ని ముందుగా బీసీ- ఏ కు చెందిన సంచార విముక్తి జాతుల వారు అందిపుచ్చు కోవాలన్నారు. డ్వాక్రా సంఘాల తరహాలో యువకులు, మహిళలు,పురుషుల విభాగాలుగా 10 నుండి 20 మందితో గ్రూపులుగా ఏర్పడి, ప్రభుత్వ బీసీ సంక్షేమ శాఖ కార్యాలయంలో తెలియజేయాలన్నారు. ఆపై రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో గ్రూపుకు వారి యూనిట్ కు సంబంధించిన శిక్షణ, అవగాహనకు రూ:పదివేలు కేటాయించి, నైపుణ్య శిక్షణ ఇప్పిస్తుందన్నారు.కేంద్ర ప్రభుత్వ ఎన్ బి సి ఎఫ్ డి సి ద్వారా ఒక లక్ష రూపాయల వరకు ఇప్పిస్తున్న రుణ పరపతి లో రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం సబ్సిడీ భరించి, మిగతా 50 శాతం ఆ గ్రూపు సభ్యులు కట్టుకునేలా అవకాశం ఇచ్చిందన్నారు. బీసీ ఏ గ్రూపు సంచార విముక్తి జాతుల వారందరూ, ఈ పథకాన్ని అందిపుచ్చుకొని, ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు కృషి చేయాలని శ్రీ శంకర రావు విజ్ఞప్తి చేశారు. ఇంకా ఈ సమావేశంలో యువజన అధ్యక్షులు క్రాంతి కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్నవరపు నాగమల్లేశ్వరరావు, రాష్ట్ర అధికార ప్రతినిధి బాదుగున్నల శ్రీను, జిల్లా అధ్యక్షుడు యామా మురళి,ఉప్పన వెంకటేశ్వర్లు, పిడుగురాళ్ల పట్టణ అధ్యక్షులు ఎడవల్లి కొండలు గౌడ్, చిలక శేఖర్, పట్టణ ప్రధాన కార్యదర్శి దూదేకుల కాసింసైదా , మల్లా రవి, మల్ల శ్రీకాంత్, మీనిగల ప్రసాదు, నల్లబోతుల నాగ,
పాల్గొన్నారు
ఇట్లు
రాష్ట్ర అధ్యక్షులు
కేసన శంకరరావు
ఆంధ్ర ప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం
Discover more from
Subscribe to get the latest posts sent to your email.