నారద వర్తమాన సమాచారం
5ఎర్ర చందనం దుంగలతో పాటు కారు స్వాధీనం
అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండలం
సానిపాయి రేంజ్ పరిధిలోని క్వారీ పాయింట్ దగ్గర మహీంద్రా రెనాల్ట్ లోగాన్ కారులో ఎర్రచందనం దుం గలు లోడు వేయుచుండగా వారిని పట్టుకొనుటకు ప్రయత్నించగా ఇద్దరు స్మగ్లర్లు పారిపోయి నట్లు పానీపాయి రేంజర్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు శేషాచలం అడవుల నుండి అక్రమంగా ఎర్రచందనం దుం గలు నరికి రవాణా చేస్తున్నారన్న సమాచారం మేరకు ఆ ప్రాంతంలో తనిఖీలు ముమ్మరం చేస్తుండగా వీరబల్లి క్వారీ పాయింట్ దగ్గర ఎర్రచందనం రవాణా చేస్తుండడంతో దాడులు చేయడంతో స్మగ్లర్లు పరారయ్యారని కేఏ04 ఎం ఈ 0510 నెంబరు గల కారును స్వాధీనం చేసుకుని అందులో ఉన్న 5 ఎర్రచందనం
దుంగలు. వాహనాన్ని రేంజి కార్యాలయానికి చేర్చి కేసు దర్యాప్తు చేసి ముద్దాయిలు ను పట్టుకుంటామన్నారు. దుం గల విలువ రెండు లక్ష రూపాయలు ఉంటుందన్నారు
ఈ దాడిలో సానిపాయ ఎఫ్ ఎస్ ఓ శ. రజని ఎఫ్ బి ఓ . అనిల్ కుమార్, సాని పాయి ఎఫ్ బి ఓ లీలా శ్రీహరి, దిన్నెల ఎఫ్ బి ఓ . యం. సునీర్ బాషా మరియు బేసు క్యాంపు, స్ట్రైక్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.