నారద వర్తమాన సమాచారం
ఆరోగ్యకర సమాజాన్ని నిర్మిద్దాం
ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్
క్రోసూరు :-
గ్రామం పరిశుభ్రంగా ఉంటే ప్రజలు కూడా బాగుంటారన్న నినాదంతో స్వచ్ఛత హీ సేవా కార్యక్రమం ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ అన్నారు ఆయన బుధవారం పల్నాడు జిల్లా క్రోసూరు మండలం ఊటుకూరు ఆరోగ్య ఉప కేంద్రం కార్యాలయం వద్ద జరిగిన స్వచ్ఛత హి సేవ కార్యక్రమం ప్రారంభించి మాట్లాడారు మొదటిగా స్వచ్ఛత హి సేవ ప్రతిజ్ఞ నిర్వహించారు ఈ సందర్భంగా శాంసన్ మాట్లాడుతూ దేశంలో ఒక ఉద్యమంలా సాగుతున్న ప్రధానమంత్రి మోడీ స్వచ్ఛభారత్ ఆలోచనను ప్రతి ఒక్కరు నిత్యజీవితంలో ఒక భాగంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించుకోవచ్చు అన్నారు తడి చెత్తకు కుళ్లిపోయే స్వభావం ఉన్నందున, రీసైక్లింగ్ ద్వారా ప్రకృతికి ఎంతో ఉపకరించే ఎరువుగా మార్చవచ్చు అన్నారు ప్లాస్టిక్, ఇనుప వస్తువులు పొడి చెత్త పరిధిలోకి వస్తాయన్నారు వాటిని సైతం చేయడానికి ఏర్పాట్లు చేసుకోవాలన్నారు పొడి చెత్త, తడి చెత్తను వేరు పరచడం ప్రతి ఇంటి వద్ద ప్రారంభం కావాలని సూచించారు ప్రజల్లో మార్పు రావాలని ఆయన సూచించారు పరిశీలించకపోతే జల వనరులు కలుషితమై జలాశయాలు దెబ్బ తింటాయన్నారు పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు రాబోయే భవిష్యత్తు తరాలకు మంచి ప్రకృతిని ఇవ్వాలని మంచి ఆరోగ్య సమాజం నిర్మిద్దామని ఆయన సూచించారు భూమిలో కలవడానికి 400 సంవత్సరాలు సమయం పడుతుందనే విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు ప్రకృతి పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఈ సందర్భంగా ఆరోగ్య ఉపకేంద్ర కార్యాలయము శ్రమదానంతో శుభ్రం చేశారు మహాత్మా గాంధీజీ కేవలం రాజకీయ స్వాతంత్రంనే కాక స్వచ్ఛమైన భారతదేశం అభివృద్ధిని కూడా ఆకాంక్షించారు దీనిని స్ఫూర్తి గా తీసుకొని స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్ ను సాధించి తద్వారా స్వచ్ఛ భారత్ను సాధించే లక్ష్యంలో నేను కృషి చేస్తానని, నేను పరిశుభ్రంగా ఉండటంతో పాటు పరిసరాల పరిశుభ్రత కోసం కొంత సమయం కేటాయిస్తానని ప్రజలు శపథం చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి షేక్ ఖాజావలి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ మాబులా ఆరోగ్య కార్యకర్త లక్ష్మి అంగన్వాడి సూపర్వైజర్ మాధవి ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.