నారద వర్తమాన సమాచారం
విజయవాడ
వైఎస్ షర్మిలా రెడ్డి
APCC చీఫ్
చంద్రబాబు తిరుమల లడ్డుపై బాంబ్ పేల్చారు
చావు కబురు చల్లగా చెప్పినట్లు ఉంది
ఇది చిన్న విషయం కాదు
జులై 12 న శాంపిల్స్ తీశారు
అదే రోజు బాబు సిఎం గా ప్రమాణ స్వీకారం చేశాడు
ఆ రోజు తీసుకున్న శాంపిల్స్ గత ప్రభుత్వం ఇచ్చిన నెయ్యి కాంట్రాక్టర్ వే
ఆ శాంపిల్స్ లో బీఫ్ ఆయిల్, ఫిష్ ఆయిల్ కంటెంట్స్ ఉన్నాయి అని రిపోర్ట్ వచ్చింది
ఇది సెంటిమెంట్ కి సంబందించిన విషయం
దేశ విదేశాల్లో ఎంతో మంది భక్తులు ఆందోళనలో ఉన్నారు
భక్తి శ్రద్ధలతో తిరుమల ప్రసాదాన్ని కళ్ళకు అద్దుకుని తీసుకుంటారు
అలాంటి ప్రసాదాన్ని కల్తీ చేశారు
చంద్రబాబు ను అడుగుతున్నాం
ఇంత పెద్ద విషయాన్ని ఇంతకాలం ఎలా క్యాజువల్ గా తీసుకున్నారు
ఇప్పుడే ఎందుకు బయట పెట్టారు ?
దీని సివియారిటీ బాబు కి ముందే తెలుసా ?
తెలిస్తే ఎందుకు ప్రజలకు చెప్పలేదు ?
జులై 23 న రిపోర్ట్ ఇస్తే ఎందుకు దాచారు ?
మీ 100 రోజుల పాలన సమావేశంలో ఎందుకు చెప్పారు ?
మీ 100 రోజుల పాలన పై ప్రజలు నిరుత్సాహంగా ఉన్నారు
ఈ విషయాన్ని గమనించి ఇష్యు దైవర్ట్ చేశారా ?
వైసిపి మీద బురద చల్లుతున్నారా ?
మీరు ఈ విషయాన్ని లైట్ తీసుకున్నారు
మీరు లైట్ తీసుకున్నా మేము మాత్రం వదిలి పెట్టం
కేంద్ర హోం శాఖ మంత్రికి లెటర్ రాస్తున్నాం
తిరుమల లడ్డూ కల్తీ పై CBI విచారణ జరగాలి
లడ్డూ కల్తీ పై మేము గవర్నర్ ను కలుస్తాం
చంద్రబాబు 100 రోజుల పాలన ఎలా ఉంది అంటే ..
శిశుపాలుడు 100 తప్పులను వేతికినట్లుగా…
YSR విగ్రహాలను, వైఎస్ఆర్ పేర్లను తొలగించడానికి సరిపోయినట్లుగా ఉంది
చంద్రబాబు 100 రోజుల పాలన నూటికి సున్నా
100 రోజుల్లో యాక్షన్ ప్లాన్ అని చెప్పాడు
100 రోజుల్లో అద్భుతాలు అన్నాడు
100 రోజుల్లో రాష్ట్రాన్ని గాడిలో పెడతాం అన్నాడు
మోడీ డైరెక్షన్ లో బాబు 100 రోజుల సినిమా అట్టర్ ప్లాప్
సూపర్ సిక్స్ లో కనీసం ఒక్క సిక్స్ కూడా అమలు కాలేదు
100 రోజుల్లో అన్ని కావాలని మేము అడగడం లేదు
ఒక మోస పూరిత ప్రభుత్వాన్ని గద్దె దించి అధికారం ఇస్తే..నమ్మకాన్ని నిలబెట్టుకునే భాధ్యత ఉండాలి కదా !
అన్నదాత సుఖీభవ కింద ఏడాదికి 20 వేలు అన్నాడు…ఎప్పుడు ఇస్తారో తెలియదు
కనీసం 7 లక్షల ఎకరాలు పంట నష్టం జరిగితే ఒక్క రూపాయి ఇవ్వలేదు
నిరుద్యోగులకు 20 లక్షల ఉపాధి అవకాశాలు అన్నాడు
లేకుంటే 3 వేల నిరుద్యోగ భృతి అన్నాడు
ఉపాధి లేదు…భృతి లేదు
2014 లో 2 వేలు భృతి అని మోసం చేశారు
ఇప్పుడు మ్యానిఫెస్టోలో పెట్టాడు
ఇది ఇస్తారో లేకుంటే కొట్టుకు పోతుందో తెలియదు
తల్లికి వందనం కింద 15 వేలు ఇస్తామన్నారు
ఎంత మంది బిడ్డలు అంటే అన్ని 15 వేలు అన్నాడు
ఈ ఏడాది ముగుస్తుంది..దీని మీద అసలు స్పందనే లేదు
రాష్ట్ర వ్యాప్తంగా 80 లక్షల మంది పిల్లలు ఎదురు చూస్తున్నారు
మహాశక్తి కింద ఇస్తామని చెప్పిన నెలకు 15 వందల పథకం పై క్లారిటీ లేదు
ప్రతి మహిళను ఒక శక్తి గా చేస్తా అన్నాడు
మహిళలకు భరోసా నింపుతా అన్నాడు
ఈ పథకం ఎప్పుడు అమలు అవుతుందో తెలియదు
3 సిలిండర్లు లేవు… ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం లేదు
దసరా,దీపావళి అని కాలం వెళ్లదీస్తున్నారు
250 కోట్లు విలువ చేసే ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఇవ్వడానికి ఇబ్బంది ఏంటి ?
కొత్త బస్సులు అని కాలయాపన చేస్తున్నారు
తెలంగాణలో 35 లక్షల మంది మహిళల నుంచి 50 లక్షల మంది మహిళలు బస్సులను ఎక్కుతున్నారు
ఇది మంచి పథకం
తొందరగా అమలు చేయండి
పథకాల అమలు పై ప్రశ్నిస్తుంటే…. డబ్బులు లేవు అంటున్నాడు
రాష్ట్రం అప్పుల్లో ఉంది అంటున్నాడు
రాష్ట్ర పరిస్థితి మీకు ఎన్నికల ముందే తెలుసు
11 లక్షల కోట్ల అప్పుల్లో ఉంది అని మీరే చెప్పారు
మీకు అప్పులు ఉన్నాయని తెలియదా ?
100 రోజుల్లో 100 అబద్ధాలు చెప్తున్నారు
ప్రభుత్వ భాధ్యత ను విజయం కింద లెక్క గడుతున్నారు
100రోజుల పాలనపై 100 విజయాలు అంటూ కరపత్రం రిలీజ్ చేశారు.
ఈ కరపత్రం చూస్తుంటే నవ్వాలో,ఏడవాలో తెలియని పరిస్థితి
హామిలు ఇవ్వడం 100రోజుల విజయమట.
చేసిన పర్యటనలు 100 రోజుల విజయమట
వరద సహాయం కింద ఇచ్చిన 25కేజిల బియ్యం 100రోజుల విజయమే నట
బుడమేరు గండ్లు పూడ్చడం 100రోజుల విజయమేనట
అమరావతికి 15వేల కోట్ల గ్యారెంటి రుణాల్లో ఒక్క రూపాయి రాకపోయినా 100రోజుల విజయమేనట
దివ్యాంగుడు నారా లోకేష్ కి కాలేజిలో సీట్ కావాలని మెసేజ్ చేస్తే అది 100రోజుల విజయమేనట
ప్రజాదర్భార్ లో ప్రజలనుంచి అర్జీలు స్వీకరించడం 100రోజుల విజయమే నట
చంద్రబాబు 10రోజులు కలెక్టర్ ఆఫీసులో నిద్రిస్తే అది 100రోజుల విజయమే నట
సౌది అరెబియాలో ఒక తెలుగు కుటుంబాన్ని తిరిగి స్వస్తలానికి రప్పిస్తే అది 100రోజుల విజమేనట
విశాఖ స్టీల్ ప్యాక్టరిలో కేంద్ర మంత్రి పర్యటిస్తే అది 100రోజుల విజయమేనట
గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలకు పేర్లు మార్చడం 100రోజుల విజయమేనట
భాద్యతలను విజయాలుగా చెప్పుకుంటూ డబ్బాలు కొట్టుకుంటున్నారే తప్పా…
100రోజుల పాలనలో ఏపి ప్రజలకు ఒరిగింది ఏమిలేదు
రాష్ట్రానికి రావాల్సిన హక్కులపై బీజేపీ తో పోరాటం లేదు
పోలవరం అంచనాలను 30 వేల కోట్లకు సవరించారు
ఎప్పుడు పూర్తి అవుతుందో తెలియదు
కేంద్రం పూర్తి చేయాల్సిన ప్రాజెక్టు ఇది
రాష్ట్ర విభజన హక్కు పోలవరం
విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ కాదు అనే నమ్మకం లేదు
ప్రైవేటీకరణ లేదు అని నిధులు ఇవ్వడం లేదు
జీతాలు ఇచ్చుకొనే పరిస్థితి లేదు.
కార్మికులు ఆందోళన చేస్తున్నా పట్టింపు లేదు
విశాఖ స్టీల్ కి వెంటనే సొంత మైన్ ఇవ్వాలి
వైఎస్ఆర్ హయాంలో సొంత మైన్ కోసం అగ్రిమెంట్ జరిగింది
మెడికల్ కాలేజీలను ఎందుకు ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్నారు ?
సీట్లు వద్దు అని ఎవరైనా అంటారా ?
అదనపు సీట్లు కావాలని కోరాలి కదా ?
రాష్ట్రంలో అసలు మెడికల్ సీట్లు తక్కువ
17 మెడికల్ కాలేజీలు అందుబాటులో వస్తె అదనంగా 2 వేల సీట్లు వచ్చేవి
తక్షణ ఏర్పాట్లు చేసి సీట్లను భర్తీ చేయాలి
వాలంటీర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలో ఉన్నారు
చంద్రబాబు వాలంటీర్లు వ్యవస్థ ను ఉండనిస్తాం అన్నారు
క్యాబినెట్ లో వాలంటీర్లు వ్యవస్థ ను కొనసాగింపు లేదు అన్నారు
వాలంటీర్లు కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాం
ఉచిత ఇసుక పథకంలో ఉచితం లేదు
బాబు 100 రోజుల లో సాధించిన విజయం 99 కి క్వాటర్
కానీ మద్యం ఏరులై పారుతుందనీ భయం ఉంది
మద్యం అమ్మకాలు పెరిగితే మహిళల మీద అత్యాచారాలు పెరుగుతాయి
మద్యం అమ్మకాలను నియంత్రించాల్సిన భాధ్యత బాబు పై ఉంది
వైసిపి విశ్వసనీయత కోల్పోయింది
వైఎస్ఆర్ మంచి పేరు సాధిస్తే..జగన్ చెడ్డపేరు సాధించారు
ఇచ్చిన హామీలు పేరుతో ప్రజలను జగన్ మోసం చేశారు
వైఎస్ఆర్ కి జగన్ కి పొంతన లేదు
వైఎస్ఆర్ ప్రజా సంక్షేమం కోసం పాటుపడితే…జగన్ రిషికొండ పేరుతో కబ్జాలు చేశాడు
బాత్ రూంకు సముద్రపు వ్యూ కావాలని కట్టుకున్నాడట
ఒక మహిళ జత్వాని ఎంత వేదించాడో మనకు తెలుసు
వైసిపి ఇక అంతం అయినట్లే
వైసిపి లో జగన్ తప్పా ఎవరు మిగలరు
వైసిపి చుట్టూ ఉన్న సాయి రెడ్డి, సజ్జల కూడా మిగలరు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.