నారద వర్తమాన సమాచారం
ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా పని చేస్తా :ఢిల్లీ సీఎం అతీషి
న్యూ ఢిల్లీ :సెప్టెంబర్ 23
ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఇటీవలే ప్రమాణ స్వీకారం చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు అతిశీ ఇవాళ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
ఆ బాధ్యతలు చేపట్టిన అత్యంత పిన్న వయస్కు రాలిగా ఆమె నిలిచారు. ఈ సందర్భంగా ఆమె రామాయణంలో రాముడి కోసం భరతుడు చేసినట్లు తాను ఆపద్ధర్మ ముఖ్య మంత్రిగా పనిచేస్తానని వ్యాఖ్యానించారు.
తన పక్కన ఓ ఖాళీ కుర్చీని ఉంచారు. ఆ కుర్చీలో సీఎంగా కేజ్రీవాల్ మళ్లీ కూర్చుకుంటారన్న సంకేతాలు ఇచ్చారు. రామాయణంలో రాముడి పాదరక్షలు సింహాసనంపై ఉంచి భరతుడు రాజ్యాన్ని 14 ఏళ్ల పాటు పాలించిన విషయం తెలిసిందే.
ఓ కుర్చీని అతిశీ చూపిస్తూ ఇది ముఖ్యమంత్రి సీటని, కేజ్రీవాల్ మళ్లీ సీఎం అయ్యే వరకు ఇది ఖాళీగా ఉంటుందని అన్నారు. దీంతో ఆమెపై బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తోంది.
కేజ్రీవాల్ రిమోట్ కంట్రోల్ ప్రభుత్వాన్ని నడుపుతారా?అని ప్రశ్నించింది. కుర్చీలో ఆమెను కూర్చోబెట్టి మిగతా వ్యవహారాలంతా కేజ్రీవాలే చూసుకుంటారని విమర్శించింది.
కాగా, ఇటీవలే నిరాడం బరంగా రాజ్ భవన్ లో ఢిల్లీ ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమాణస్వీకారం జరిగింది. ఢిల్లీ ముఖ్య మంత్రిగా అతిశీతో ప్రమాణ స్వీకారం చేయించారు
ఎల్జీ వినయ్ కుమార్ సక్సేనా. ఢిల్లీ 8వ ముఖ్యమంత్రిగా అతిశీ నిలిచారు. మంత్రులుగా సౌరభ్ భరద్వాజ్, కైలాశ్ గెహ్లాట్, గోపాల్ రాయ్, ఇమ్రాన్ హుస్సేన్, ముకేశ్ అహ్లావత్ ప్రమాణ స్వీకారం చేశారు.
సెప్టెంబర్ 26-27 తేదీల్లో ఢిల్లీ అసెంబ్లీలో అతిశీ బలనిరూపణ చేసుకోను న్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.