నారద వర్తమాన సమాచారం
శ్రీవారి మెట్టుమార్గంలో మరోసారి చిరుత సంచారం
తిరుపతి జిల్లా:
తిరుమల మెట్ల మార్గంలో చిరుత సంచారం మరోసారి భక్తులను భయాందోళనకు గురిచేసింది.తిరుమల చేరేందుకు ప్రధాన మార్గా ల్లో ఒకటైన శ్రీవారిమెట్టు వద్ద చిరుత కలకలం సృష్టించింది.
నిన్న రాత్రి కంట్రోల్ రూం వద్ద చిరుత సంచరించింది. చిరుతను చూసిన కుక్కలు వెంటాడాయి. అదే సమయంలో కుక్కలపై ప్రతిదాడికి చిరుత యత్నించింది.
చిరుత సంచరించిన దృశ్యాలు సీసీకెమెరాలో రికార్డయ్యాయి. చిరుత గురించి కంట్రోల్ రూం వద్ద ఉన్న సెక్యూరిటీ అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చాడు.
క్రూర జంతువుల సమా చారంతో రాత్రి వేళలో మెట్ల మార్గంలో వెళ్లే శ్రీవారి భక్తులు ఆందోళన చెందుతున్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.