నారద వర్తమాన సమాచారం
నేడు ప్రశాంత్ కిషోర్ రాజకీయ పార్టీ ప్రకటన
ఎన్నికల వ్యూహకర్తగా పేరుపొందిన నేత ప్రశాంత్ కిషోర్, కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించిన అది ఫలించకపోవడంతో సొంత కుంపటి పెట్టుకోవా లని నిర్ణయించుకున్నారు. అంతేకాదు ఈరోజు తన పార్టీని ప్రారంభించబోతు న్నారు.
పార్టీ ప్రారంభించిన తర్వాత కూడా జన్ సూరజ్ పాద యాత్ర కొనసాగుతుందని పీకే ప్రకటించారు. వచ్చే ఏడాది బీహార్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ పార్టీ చిత్రం ఎలా ఉంటుంది.? ఎవరు ప్రము ఖ,ముఖాలు .? అలాగే NDA-మహా కూటమి చుట్టూ తిరుగుతున్న రాష్ట్ర రాజకీయాల్లో ఈ కొత్త పార్టీ ఎంత.? ఎలా చోటు సంపాదించగలదు? అనే ప్రశ్నలన్నీ ప్రజల మదిలో మెదులుతున్నాయి.
ఇకపోతే ఈ పార్టీకి అనేకమంది నాయకులు, మాజీ అధికారులతో సహా సమాజంలోని ప్రతి వర్గాల ప్రజలు జన్ సూరజ్ పార్టీతో అనుబంధం కలిగి ఉన్నారు.
జాన్ సూరాజ్‌తో సంబంధం ఉన్న ప్రముఖ ముఖాల గురించి చూస్తే., కేంద్రంలో మంత్రిగా ఉన్న డిపి యాదవ్ నుండి చాలా మంది పెద్ద నాయకులు, భారతీయ జనతా పార్టీ (బిజెపి) మాజీ ఎంపి చెడ్డీ పాశ్వాన్, మాజీ ఎంపి పూర్ణమసి రామ్ నుండి మోనాజీర్ హసన్ వరకు జాన్ సూరాజ్‌తో సంబంధం కలిగి ఉన్నారు.
100 మందికి పైగా మాజీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారు లు పార్టీతో అనుబంధం కలిగి ఉన్నారు.ఇక PK పార్టీ ఎజెండా విషయానికి వస్తే.. వలసలు, నిరుద్యో గం, మద్యపాన నిషేధం, విద్య వెనుకబాటు తనం వరకు రాష్ట్ర సమస్యలపై PK పార్టీ పరిష్కారం చేస్తామని పీకే స్వయంగా చెబుతూ వస్తున్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.