నారద వర్తమాన సమాచారం
పిండం కాకుల పాలు … శాస్మనం అక్రమార్కుల పాలు …
కుల సంఘాల పేరుతో పంచాయితీ తీర్మానం
బెల్లంకొండ :-
మండల కేంద్రమైన బెల్లంకొండ గ్రామ శివారులో 364 సర్వే నెంబర్ లో హిందువులకు ఎప్పుడో శాస్మన వాటిక కట్టించారు. గత వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ నాయకులు శాస్మన వాటిక పై కన్ను పడింది పహరి గోడను తొలగించి అక్రమంగా నిర్మాణం చేపట్టగా సత్తెననల్లి రెవెన్యూ డివిజనల్ అధికారి రాజకుమారి అడ్డుకొని నాడు నిర్మాణాలను తొలగించారు. కానీ ఇప్పుడు టీడీపీ అధికారంలోకి రావటంతో ఆ భూమి పై అధికార పార్టీ నాయకులు కుల సంఘాల పేరుతో కొంత మంది ఆక్రమణలకు గురి అయ్యే అవకాశం ఉందనే ఊహాగానాలను ప్రజలను అధికారులను మభ్యపెట్టి ప్రహరీని తొలగించి ఐదు గదుల నిర్మాణం చేశారు. కర్మకాండల సమయంలో పలు కార్యక్రమాలకు గాజు, పూస తీసే సమయంలో మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకు వీలుగా గదులను పంచాయితీ తీర్మానం చేశారు. ఇప్పడు శాస్మన వాటికలో తమ సొంత ఆస్తి అయినట్లుగా అధికార పార్టీ కి చెందిన నాయకులు గాజు పూస తీసే సమయంలో మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకు వీలుగా గదులను పార్టీ కార్యక్రమాలకి ఒక గది. టి.స్టాల్ వ్యపారానికి ఇచ్చి అద్దెలు వసూలు చేసుకొని జేబులు నిపుకుటూన్నారు. అనేక పత్రికలలో అక్రమ నిర్మాణాలు అంటూ కధనలు వచ్చిన అధికారులందరూ మామూలు మత్తులో ఉండి అటువైపు కన్నెత్తి చూడటం లేదు పిండం కాకుల పలు శాస్మనం అక్రమార్కుల పలు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందిచి గదులు అద్దెకిచ్చే అక్రమార్కులపై చర్యలు చేపట్టి కట్టిన గదులను కర్మకాండల సమయంలో పలు కార్యక్రమాలకు గాజు, పూస తీసే సమయంలో మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకు వీలుగా గదులను కులాల వారిగా అప్పగించి అందరికీ ఉపయోగపడేలా చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.