నారద వర్తమాన సమాచారం
పిడుగురాళ్ల పట్టణంలోని పలు దేవాలయాలో దసరా శరన్నవవరాత్రుల సందర్బంగా ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు
పల్నాడు జిల్లా, గురజాల నియోజకవర్గం, పిడుగురాళ్ల పట్టణంలోని
1) ఎమ్మార్వో ఆఫీస్ వద్ద ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం,
2) ఎమ్మార్వో ఆఫీస్ వద్ద ఉన్న శ్రీ సువర్చల సమేత ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానం,
3) కట్టెల అడితీ సెంటర్ వద్ద ఉన్న శ్రీ బ్రహ్మంగారి దేవస్థానం,
4) కట్టెల అడితీ సెంటర్ వద్ద ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానం,
5) జానపాడు రోడ్డులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం,
6) మెయిన్ రోడ్డులోని శ్రీ గంగమ్మ తల్లి దేవస్థానం,
7) శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి (శివాలయం) వారి దేవస్థానం,
8) పిల్లుట్ల రోడ్డు లోని నాగుల గుడి దేవస్థానం,
9) చండ్రపాలెం వడ్డెర యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహం,
10) బ్రహ్మానంద రెడ్డి కాలనీ శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవస్థానం,
వివిధ దేవస్థానములు మరియు అమ్మవారి విగ్రహాల వద్ద దసరా శరన్నవరాత్రులు సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి పూజా కార్యక్రమాల్లో గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు పాల్గొనటం జరిగింది. అనంతరం దేవాలయాల నందు దేవాలయం కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లక్కీ డ్రాలో బహుమతులు గెలుపొందిన మహిళలకు యరపతినేని గారు బహుమతులు పంపిణీ చేసారు.
ఈ కార్యక్రమంలో పిడుగురాళ్ల పట్టణంలోని తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీలలోని రాష్ట్ర, పార్లమెంటు, నియోజకవర్గం, మండలం, గ్రామ, వార్డు స్థాయిలలో వివిధ హోదాల్లో ఉన్న కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, యువత, మహిళలు పాల్గొనడం జరిగింది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.