నారద వర్తమాన సమాచారం
పల్నాడు జిల్లా పోలీస్…..
విఘ్నాలు తొలగి విజయాలు చేకూరాలని పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయములో విజయ దశమి(దసరా పండుగ) సందర్భంగా ఆయుధ పూజ , కనక దుర్గ అమ్మవారి పూజ నిర్వహించిన పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాస రావు ఐపీఎస్ .
ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు,పోలీస్ అధికారులు మరియు సిబ్బందికి విజయ దశమి శుభకాంక్షలు తెలిపిన ఎస్పీ… ఎస్పీ మాట్లాడుతూచరిత్ర ప్రకారం విజయదశమి రోజున రాముడు రావణునిపై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసానికి వెళ్తూ జమ్మి చెట్టుపై ఉన్న తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు మరియు జగన్మాత అయిన దుర్గా దేవి, మహిషాసురుడనే రాక్షసునితో తొమ్మిది రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి విజయాన్ని పొందిన గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటారు అని తెలిపారు.
చెడుపై మంచి, దుష్టశక్తుల మీద దైవశక్తులు సాధించిన విజయానికి ప్రతీకే ఈ దసరా పండుగ. చెడు ఎంత దుర్మార్గమైనదైనా అంతిమ విజయం మంచినే వరిస్తుందన్న సందేశాన్ని ఈ పండుగ తెలియజేస్తుందని ఎస్పీ తెలిపారు. అమ్మవారి పూజ అనంతరం వాహనాలకు మరియు ఆయధాలకు పూజ నిర్వహించారు.పూజ కార్యక్రమం అనంతరం ఎస్పీ పోలీసు సిబ్బందికి భోజన ఏర్పాట్లు చేశారు.
ఈ కార్యక్రమములో ఎస్పీ తో పాటు అదనపు ఎస్పీలు జె.వి సంతోష్ (పరిపాలన), డి.రామచంద్ర రాజు(ఆర్మ్ డ్ రిజర్వ్) , లక్ష్మీపతి(క్రైం), నరసరావుపేట డిఎస్పీ నాగేశ్వర రావు , ఏ ఆర్ డిఎస్పీ గాంధీ రెడ్డి , నరసరావు పేట సీఐ లు, ట్రాఫిక్ సి.ఐ, ఆర్.ఐలు,ఎస్సైలు,ఇతర పోలీస్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.