నారద వర్తమాన సమాచారం
విద్యుత్ మోటార్ తొలగించి చేతిపంపును బిగించడి మహాప్రభో..
బెల్లంకొండ :
పంచాయతీ బోరులో ఉన్న విద్యుత్తు మోటారు తొలగించి చేతి పంపును బిగించమని ఎస్సీ కాలనీవాసులు అధికారులను వేడుకుంటున్నారు. వివరాల్లోకి వెళ్ళగా మండలంలోని పాపాయపాలెం గ్రామంలోని ఎస్సీ కాలనీలో 150 కుటుంబాలు నివాసం ఉంటుండగా ప్రభుత్వ పంచాయతీ చేతి పంపులు మూడు ఉన్నాయి అయితే కాలనీలోని ఒక కుటుంబం వారు చేతిపంపు తొలగించి బోరుబావిలో విద్యుత్ మోటార్ను బిగించి వారి కుటుంబం ఒక్కరే నీటిని వినియోగించుకుంటున్నారు. విద్యుత్ మోటార్ బిగించడం వల్ల మిగిలిన వారికి నీరు లేక నాలుగు వీధిలో అవతలకు వెళ్లి నీళ్లు తెచ్చుకోవాల్సి వస్తుందని ఇబ్బందులు గురవుతున్నామని ఆవేదన చెందుతున్నారు. గత వైసిపి ప్రభుత్వంలో నుండి ఎన్ని మార్లు తమకు ఏర్పడిన నీటి సమస్యని తీర్చమని ఆర్జీలు పెట్టి అధికారులను విన్నవించుకున్న ఎలాంటి ఫలితం లేదని వాపోతున్నారు. ఈ సమస్యను ఆర్ డబ్ల్యూ ఎస్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన మాకు సంబంధం లేదంటూ సమాధానం చెబుతున్నారని చేతిపంపు వినియోగదారులు పత్రికా ముఖంగా తెలుపుతున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు కాలనీవాసుల సమస్యను పరిశీలించి బోర్లో వేసిన విద్యుత్ మోటార్ను తొలగించి చేతిపంపులు బిగిస్తే కాలనీ వాసులకు న్యాయం చేసిన వారవుతారని వారు అధికారంలో కోరుతున్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.