నారద వర్తమాన సమాచారం
హైదరాబాద్ లోని ముత్యాలమ్మ ఆలయానికి మహిళ అఘోరి
హైదరాబాద్
సికింద్రాబాద్ మొండా మార్కెట్ సమీపంలోని కుమ్మరిగూడ ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని కాలితో తన్ని ధ్వంసం చేసిన ఘటన హిందువులకు ఆగ్రహాన్ని తెప్పించిన సంగతి పాఠకులకు తెలిసిందే, కొద్ది రోజుల క్రితం అమ్మవారి విగ్రహాన్ని పున;ప్రతిష్టించి శాంతి పూజలు యాగాలు చేస్తున్నారు.
ఈ క్రమంలో తాజాగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దమ్మాయిగూడ మున్సిపల్ పరిధిలోని కీసరగుట్టలో మహిళ అఘోరి ప్రత్యక్షమయ్యారు. శ్రీ భవాని శివ దుర్గా సమేత రామలింగేశ్వర స్వామికి స్వయంగా తన చేతులతో భస్మాభిషేకం చేశారు.
అంతకుముందు విగ్రహ ధ్వంసానికి గురైన సికింద్రా బాద్ కుమ్మరిగూడలోని ముత్యాలమ్మ గుడికి వచ్చిన అఘోరి ప్రత్యేక పూజలు నిర్వహించి, హోమం చేసి ఆలయ సంప్రోక్షణ చేపట్టారు. ఒంటి కాలిపై నిలబడి పూజలు చేశారు.
తనను కలిసిన మీడియా తో మహిళా అఘోరి మాట్లాడుతూ.. తన విశేషాలను వెల్లడించారు. తన స్వస్థలం మంచిర్యాల అని, ఏడేళ్ళ వయసులో తన గురువు అఘోరి దీక్షను ఇవ్వడంతో హిమాల యాలకు వెళ్లిపోయానని, ప్రస్తుతం 27ఏళ్ళని, తాను 18శక్తి పీఠాలు, 12జ్యోతి ర్లింగాలు దర్శించుకోవడం జరిగిందని తెలిపారు.
అఘోరి, నాగసాధు రెండు దీక్షలను తాను పూర్తి చేశానన్నారు.ఏండ్ల తరబడి హిమాలయాల్లో తపస్సులో ఉన్న తమకు అందరి మాదిరిగా చదువుకునే అవకాశం లేదని, అయితే దైవ కృపతో దేశంలోని ప్రముఖ భాషలను అర్ధం చేసుకోగలుతానని, మాట్లాడుతానని వెల్లడించారు.
గురువు అనుమతితో సనాతన ధర్మ పరిరక్షణకు హిమాలయాల్లోని కేదార నాధ్, కైలాష్ పర్వతాలను వీడి జనసంచారంలోకి వచ్చి ఐదేళ్ళుగా దేశంలో పర్యటిస్తున్నానని తెలిపా రు. మరో 25సంవత్సరాలు మాత్రం తన దేహం భూమి పై ఉంటుందని అప్పటిదాక సనాతన ధర్మ సంరక్షణకు పాటుపడుతానని తెలిపారు.
తన స్వస్థలం తెలంగాణలో మంచిర్యాల అని చెప్పు కొచ్చింది, ఈ తెలంగాణలో పర్యటించడం ఆనందంగా ఉందని, శక్తి పీఠాల్లో జోగులాంబ అమ్మవారు ఈ ప్రాంతంలో ఉండటం గొప్ప విషయమన్నారు. తన తదుపరి పర్యటన గుజరాత్ లో కొనసాగు తుందన్నారు…
Discover more from
Subscribe to get the latest posts sent to your email.