నారద వర్తమాన సమాచారం
కోలాహలంగా అబ్దుల్ కలాం జాతీయ ప్రతిభా అవార్డుల ప్రధానోత్సవం
గుంటూరు, అక్టోబర్ 20:
సదరన్ ప్రైవేట్ లెక్చరర్స్ టీచర్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఆదివారం గుంటూరు ఎసి కళాశాల ప్రాంగణం లో ఏపీజె అబ్దుల్ కలాం ప్రతిభా అవార్డుల ప్రధానోత్సవం కోలాహలం గా జరిగింది. సభ కు అధ్యక్షత వహించిన సంఘ గౌరవాధ్యక్షులు ఎమ్మెల్సీ కె ఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ విద్యార్థులను భావి భారత పౌరులుగానూ….పలు ఉన్నత రంగాల్లో నిష్ణాతులు గానూ తీర్చిదిద్దడంలో గురుదేవుల పాత్ర మురువలేనిదన్నారు.
ఈ సందర్భంగా ప్రైవేట్ విద్యారంగానికి చెందిన వంద మంది అధ్యాపక, ఉపాధ్యాయులు పలువురు డైరక్టర్లను ఘనంగా సత్కరించడం జరిగింది. వీరిలో తెనాలి కి చెందిన విశ్రాంత ఉపాధ్యాయులు వి ఉమామహేశ్వరరావు, మొవ్వా సత్యనారాయణ, సైన్స్ సెంటర్ డైరక్టర్ రాయపాటి శివ నాగేశ్వరరావు ను సత్కరించారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ నిమ్మరాజు చలపతిరావు మాట్లాడుతూ 1982-85 మధ్య కాలంలో తెనాలి లో ఈ ముగ్గురితో కలిసి తాను తెలుగు ఉపాధ్యాయుని గా పనిచేయడం తన అదృష్టంగా చెబుతూ ఆ ప్రాంత జర్నలిస్ట్ అబ్దుల్ హాకీం తో కలసి అభినందించారు.
ఈ కార్యక్రమంలో సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు డా. పి నాగయ్య, శాసనసభ్యులు నశీర్ అహ్మద్, విద్యావేత్తలు మలినేని పెరుమాళ్లు, కాటూరి వెంకటేశ్వరరావు, మేకల యవీంద్రబాబు, విల్సన్, ఏసి కళాశాల ప్రిన్సిపాల్ డా. కె మోహన్, లా కళాశాల వైస్ ప్రిన్సిపాల్ పి రాణి శ్రీ అమృతవర్షిణి తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.