నారద వర్తమాన సమాచారం
జర్నలిస్టులు సత్యాన్ని బయట పెట్టేందుకు ఎవరికి భయపడకుండా ప్రజల ముందు,ప్రభుత్వం ముందు తన కలంతో ఉంచాలన్న డిసిసి జిల్లా అధ్యక్షులు ప్రశాంత్ కుమార్ రెడ్డి
జర్నలిస్టుల హెల్త్,ఇళ్ల స్థలాలు గురించి సీఎం తో మాట్లాడి త్వరలోనే పరిష్కారం చేస్తా
జర్నలిస్టులకు అండగా ఉంటా
తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు(ఐ జే యు) నారాయణపేట జిల్లా కేంద్రం లో ప్రథమ మహాసభ కార్యక్రమం లో భాగంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రశాంత్ కుమార్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. జర్నలిస్టులు నిజాన్ని రాసేందుకు భయపడద్దని,ఏ ప్రభుత్వం ఉన్నా సత్యాన్ని ప్రజల ముందు ఉంచేందుకు మీయొక్క కాలాన్ని గట్టిగా ధైర్యంగా రాయండి అని ఆయన ఎవరికి భయపడకుండా తప్పు ఎవరిదైనా కలంతో నిజం బయట పెట్టేందుకు భయపడకుండా జర్నలిస్టులకు ఏదైనా ఇబ్బందులు ఎదురైతే మేము మీకు అండగా ఉంటామని ఉన్నారు.సమాజంలో జరుగుతున్న సమస్యల పరిష్కారానికి నిరంతరం జర్నలిస్టు లే అని ఆయన అన్నారు.ఎన్ని ఇబ్బందులు ఉన్న ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చి,పరిష్కారం అయ్యేంతవరకు కృషి చేస్తారని అన్నారు. జర్నలిస్టుల సమస్యలు జిల్లాలో ని 13 మండలాల లో హెల్త్ కార్డు గాని ఇళ్ల స్థలాలు గాని సమస్యల పరిష్కారానికి ఇళ్లస్థలాలు అందరికీ త్వరలోనే అందజేసేందుకు సీఎం గారితో మాట్లాడుతానని అన్నారు.సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గం లో నాలుగు మండలాలు జిల్లాలో ఉన్నాయని,జర్నలిస్టులు నిజాన్ని బయటికి పెట్టి క్రమంలో ప్రభుత్వంలో అయినా ఎవరైనా భయపడకుండా ధైర్యంగా సత్యాన్ని,సమస్యలను బయటపెట్టాలని మీకు అండగా నేను మా ప్రభుత్వం ఉంటుందని అన్నారు.ఈ TUWJ ప్రథమ మహాసభ కు ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జర్నలిస్టుల నాయకులు పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.