Thursday, November 21, 2024

పిడుగురాళ్లలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం- ఆయుర్వేద వైద్యాధికారిణి డా. కె.మేఘమాల. ఎం.డి

నారద వర్తమాన సమాచారం

పిడుగురాళ్లలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం- ఆయుర్వేద వైద్యాధికారిణి డాక్టర్ కే. మేఘమాల

పిడుగురాళ్ల,

9వ ఆయుర్వేద జాతీయ దినోత్సవం సందర్భంగా జరుపబడుతున్న వారోత్సవాల్లో భాగంగా సోమవారం పిడుగురాళ్ల పట్టణంలోని 2వ వార్డు నందు ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం మరియు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ అవగాహన సదస్సు నందు పిడుగురాళ్ల మరియు ఇన్చార్జి బెల్లంకొండ వైద్యాధికారిణి డాక్టర్ కే. మేఘమాల పాల్గొన్నారు. ఈ సదస్సు నందు ఆయుర్వేద ప్రాముఖ్యత, మరియు దినచర్య, ఋతుచర్య నందు ఆచరించవలసిన నియమములు, యోగా యొక్క అవగాహన గురించి డాక్టర్ మేఘమాల వివరించారు. ఈ ఉచిత ఆయుర్వేద శిబిరం నందు సుమారు వంద మంది కి పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ మేఘమాల తో పాటు ఆయుర్వేద వైద్యశాల కాంపౌండర్ డి. ప్రభు ప్రసాద్, యోగా శిక్షకులు హనుమంతు నాయక్, కోటేశ్వరమ్మ, అంగన్వాడి టీచర్లు జయశ్రీ, శాంత కుమారి తదితరులు పాల్గొన్నారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version