నారద వర్తమాన సమాచారం
పల్నాడు జిల్లా పోలీస్…
సమాజం సంఘటితంగా ఉంటేనే దేశం పటిష్టంగా ఉంటుంది – పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాస రావు ఐపీఎస్
పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాస రావు ఐపీఎస్ ఆధ్వర్యంలో భారతదేశ మొదటి ఉప ప్రధాని మరియు దేశ మొదటి హోంశాఖ మంత్రి స్వర్గీయ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని నరసరావుపేట పోలీసు జిల్లా ప్రధాన కార్యాలయం లో రాష్ట్రీయ ఐక్యత దినోత్సవం(రాష్ట్రీయ ఏక్తా దివస్)ను ఘనంగా నిర్వహించిన పల్నాడు జిల్లా పోలీసులు.
ఈ సందర్భంగా పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబుగారు,జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే ఎస్పీ జిల్లా పోలీస్ సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భముగా ఎస్పీమాట్లాడుతూ….
మన జాతి నిర్మాణానికి పునాదులు వేసిన మహోన్నత వ్యక్తులలో వల్లభాయ్ పటేల్ ఒకరు.మన దేశం ఇంత ఉన్నతంగా,ఐక్యంగా ఉందంటే అది కేవలం వల్లభాయ్ పటేల్ కృషి ఫలితమే. ఈ రోజు మనం ఒక దేశంగా ఐక్యంగా ఉంటూ ముందుకెళ్తున్నామంటే అది కేవలం వల్లభాయ్ పటేల్ కృషి వల్లనే సాధ్యం అయింది.
భారత దేశ స్వాతంత్ర్యానంతరం దేశం చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయినప్పుడు వల్లభాయ్ పటేల్ నాయకత్వంలోని అప్పటి మన నాయకులు అందరూ ఎంతో కృషి చేసి సమస్యాత్మకంగా ఉన్న అన్ని రాజ్యాలను ఒకటిగా విలీనం చేసి,ఏకైక దేశముగా రూపుదిద్దారు.
సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మరియు ఇతర నాయకులు చేసిన విలువైన త్యాగాలను స్మరించుకోవడానికి ఇది మంచి తరుణం.
దేశ ఐక్యత దినముగా చెప్పుకునే ఈ రోజును నిర్ధారించడానికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ముందుంటుంది. సమాజములో జరుగుతున్న నేరాలను మరియు నేర పూరిత చర్యలను అరికట్టడానికి పోలీసులమైన మనం పతాక దారులుగా(Flag Bearers) ముందుండి సత్యం,సమానత్వం,న్యాయం(Truth, Equality and Justuce) అనే ఆయుధాలను ధరించి నిజాయితీగా సమాజములో న్యాయం కోసం నిలబడటమే ఐక్యతకు సరియైన నిర్వచనం.
కావున దేశ ఐక్యతను సాధించడం కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన త్యాగాలను,పడిన కష్టాలను మరొక్కసారి స్మరించుకుంటూ ఆ మహానీయునికి ఘనంగా నివాళులు అర్పించుకుందాం.
ఈ రోజు(31.10.2024) ఉదయం ఎస్పీ ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా పోలీసు వారు చేపట్టిన ఐక్యత కోసం పరుగు(Run for Unity) కార్యక్రమాన్ని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం నుండి పల్నాడు జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ కలిసి జెండా ఊపి ప్రారంభించినారు .
పోలీస్ ప్రధాన కార్యాలయం నుండి పోస్టాఫీసు వరకు సాగిన ఈ ఐక్యత కోసం పరుగు(Run for Unity) లో పోలీస్ మరియు విద్యార్థిని – విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పల్నాడు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం ఆవరణ నందు స్వాతంత్ర్య సమరయోధుడు,నవ భారత నిర్మాత,ఉక్కుమనిషి,బార్డోలి వీరుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి ఎస్పీ, కలెక్టర్ జాయింట్ కలెక్టర్ మరియు ఇతర పోలీస్ అధికారులు పూలమాల వేసి, గౌరవ వందనం చేసి,ఘన నివాళులు అర్పించినారు.
తదనతరం పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు కార్యక్రమానికి హాజరైన అధికారులు, పోలీసులు,విద్యార్థిని – విద్యార్థుల చేత దేశ ఐక్యత దినోత్సవ(Rastra Ektha Diwas) ప్రతిజ్ఞ చేపించారు…..
దేశ ఐక్యత, సమగ్రత, భద్రతను కాపాడటానికి మనః పూర్వకముగా దేశానికి నన్ను నేను అంకితం చేస్తున్నాను.
ఈ సందేశాన్ని నా తోటి దేశ ప్రజల మధ్య వ్యాప్తి చేయడానికి కూడా కృషి చేస్తాను.
సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ దార్శనికత(vision), చర్యల(Actions) ద్వారా సాధ్యం అయిన నా దేశ ఏకీకరణ స్ఫూర్తితో నేను ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను.
నా దేశ అంతర్గత భద్రతను కాపాడటం కొరకు నా స్వంత సహకారం అందించాలని కూడా నేను పూర్తిగా తీర్మానిస్తున్నాను.
ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ ఎస్పీ అదనపు ఎస్పీ(అడ్మిన్) జె.వి.సంతోష్ ఏఆర్ డిఎస్పీ మహాత్మ గాంధీ రెడ్డి సీఐలు,ఆరైలు,పోలీస్ సిబ్బంది మరియు విద్యార్థిని – విద్యార్థులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.