నారద వర్తమాన సమాచారం
దాచేపల్లి మండలంలో ముత్యాలంపాడు, తంగెడ గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమంలో భాగంగా రైతులకు శిక్షణ ఇచ్చిన వ్యవసాయ మండల వ్యవసాయ అధికారులు
దాచేపల్లి:-
దాచేపల్లి మండలంలోని ముత్యాలంపాడు, తంగెడ గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో భాగంగా యం. శివకుమారి ,జిల్లా వనరుల కేంద్రం, నరసరావు పేట డి.డి ఎ ,పాల్గొని రైతులకు శిక్షణ ఇవ్వటం జరిగింది.
మిరప పంట యాజమాన్యం గురించి మాట్లాడుతూ సూపర్ ఫాస్పేట్ ఎరువును దుక్కిలో వేసుకోవాలి అలా కుదరని యెడల ప్రస్తుతం సూపర్ పాస్ఫట్ ఎరువును వాడినట్లయితే క్యాల్షియం, జింకు ,పొటాష్ పోషకాలు ఉండటం వలన మిరప కాయలు తాలు శాతాన్ని తగ్గించి ,అధిక, నాణ్యమైన దిగుబడికి తోడ్పడతాయని తెలిపారు.
రసాయన ఎరువులకు బదులుగా జీవన ఎరువులు, పశువుల ఎరువులు వినియోగాన్ని పెంచినట్లయితే ప్రభుత్వానికి సబ్సిడీ భారం తగ్గటంతో పాటు ఓజోన్ పొరను, మన ఆరోగ్యాన్ని కాపాడిన వారము అవుతామని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో భాగంగా పొలాలను సందర్శించి మిరప, కంది పంటలపై ప్రస్తుత పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యల గురించి రైతులకు వివరించడం జరిగింది.
జిల్లాలో పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, పత్తిని సిసిఐ లో అమ్మాలనుకున్న రైతులు రైతు సేవా కేంద్రాలలో రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలని, పత్తి ధర 7521 / క్వింటా కు ఉన్నవి అని, పత్తిని రైతులు లూజుగానే కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకెళ్లాలని తెలియజేశారు.
ఈ రభీ సీజన్ నుంచి రైతులు ఇన్సూరెన్స్ కి నోటిఫై చేసినటువంటి వరి పంటకు ఎకరాకు 630 రూపాయలను మీ సేవా కేంద్రాల ద్వారా వారే ఇన్సూరెన్స్ ప్రీమియం అమౌంట్ ని చెల్లించవలసి ఉంటుంది అని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారిని డి.పాప కుమారి వ్యవసాయ శాఖ సిబ్బంది హరి, జానీ, గ్రామ నాయకులు మరియు రైతులు పాల్గొనడం జరిగింది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.