పిడుగురాళ్ల పట్టణంలో ఘనంగా శ్రీ విరాట్ విశ్వకర్మ సంక్షేమ సంఘం 24వ కార్తీక వన సమారాధన
నారద వర్తమాన సమాచారం
పిడుగురాళ్ల :-
పల్నాడు జిల్లా
పిడుగురాళ్ల పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం వారి ఆధ్వర్యంలో శ్రీ ముచికుంద మహర్షి ఆశ్రమం ( కొండమోడు) నందు 24వ కార్తీక వన సమారాధన
ఘనంగా నిర్వహించారు.
కార్తీక మాసంలో శివకేశవులను ఆరాధించడం శ్రేష్టమైనది. ఈ కార్తీకమాసంలో ధాత్రి వృక్షాల ( ఉసిరి చెట్టు ) క్రింద భక్తిశ్రద్ధలతో యాగాలు క్రతువులు, పూజ, హోమములు వ్రతాలు నిర్వహించుకొని అందరూ కలిసి పచ్చని చెట్ల వన సంపదల మధ్యలో వనభోజనాలు ఆచరించడమనేది. మన పూర్వీకులనుండివస్తున్న ప్రధాన ఆచారం ఈ సందర్భంగా పిడుగురాళ్ల పట్టణవిశ్వకర్మ సంఘీయుల ఆధ్వర్యంలో కార్తీక మాసం మూడవ శనివారం (అనగా) 16/11/2024న కొంమోడులోని ముచికుంద మహర్షి ఆశ్రమం నందు నిర్వహించినారు.
ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ కొమ్మూరి విశ్వరూపాచార్యులు మరియు వారి శిష్య బృందం చ్చే కొంతమంది విశ్వకర్మ దంపతులచే శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి వారి వ్రత నిర్వహణ కార్యక్రమాన్ని జరిపించినారు.పూజ అనంతరము పట్టణ మరియు మండల విశ్వకర్మ లందరూ కూడా పచ్చని వనము మధ్యలో వనభోజన కార్యక్రమాన్ని ఆచరించారు.
ఈ సందర్భంగా పిడుగురాళ్ల పట్టణ విశ్వకర్మ సంఘం అధ్యక్షులు సుతారు మల్లేశ్వరరావు మాట్లాడుతూ అనాదిగా మన పూర్వీకుల నుండి వస్తున్న ప్రధాన ఆచారం కార్తీక మాసంలో కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని ప్రతి ఏటా విశ్వకర్మ సంఘీయుల అంతా కుటుంబ సపరివార సమేతంగా,సాంస్కృతిక కార్యక్రమాల తో కార్తీక వనం భోజనాలను ఆచరించడం ఆనందదాయకమని అన్నారు
ఈ కార్యక్రమంలో పిడుగురాళ్ల మండల విశ్వకర్మ సంఘం అధ్యక్షులు మల్లెం నాసరా చారి, ధర్మవరపు వెంకటాచారి, దార్ల ఆంజనేయ చారి, రాగి శ్రీనివాసచారి, ములుగు రాఘవాచారి, కొమ్మూరి విశ్వరూపాచార్యులు, డి కొండ లక్ష్మణాచారి మరియు విశ్వ కర్మ పెద్దలు,సంఘీయులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.