నారద వర్తమాన సమాచారం
పిడుగురాళ్ల పట్టణ ఆర్యవైశ్యుల కార్తీక వన సమారాధన
పిడుగురాళ్ల :-
17 /11 /2024 న ఆదివారం శ్రీ ముచికుంద మహర్షి ( కోటిరెడ్డి ) ఆశ్రమం నందు పిడుగురాళ్ల పట్టణ ఆర్యవైశ్యుల కార్తీక వన సమారాధన మహోత్సవము ఘనంగా నిర్వహించారు
ఈ కార్యక్రమంలో పిడుగురాళ్ల పట్టణ ఆర్యవైశ్య సోదర సోదరీమణులు సకుటుంబ సమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతములు ఆచరించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు యువ నాయకులు నిఖిల్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ
కార్తీకమాసం అంటే వనభోజనాలకు కేరాఫ్. ఏడాదిలో ఒక్కసారయినా తమ కుటుంబం, బంధుమిత్రులతో కలిసి వనభోజనాలను వెళ్తుంటారు చాలామంది. సోమవారం నాడు ఉపవాసం ఉండటానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో.. అంతే ప్రాధాన్యత ఈ వనభోజనాలకు కూడా ఉంటుంది.
ఓ ఈవెంట్‌గా దీన్ని నిర్వహిస్తుంటారు చాలా చోట్ల. ఈ నెలలో ఆత్మీయ సమ్మేళనాలు, వనభోజనాలతో పండగ వాతావరణం, కోలాహలం నెలకొంటుంది. శ్రావణం, వైశాఖం వంటి మాసాలు ఉన్నప్పటికీ.. కార్తీక మాసంలోనే వనభోజనాలను నిర్వహించడానికి కారణాలు లేకపోలేదు. పైగా ఉసిరి చెట్టు కింద భోజనం చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అని అన్నారు
ఉసిరి క చెట్టును పూజించడం, దాని కింద కూర్చుని భోజనం చేయడం ఇవన్నీ ఒక పవిత్ర కార్యంగా భావిస్తుంటారు. ఉసిరి చెట్టుకు ఉన్న మరో పేరు ధాత్రి. లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. అందుకే శివకేశవులు ఇద్దరికీ ప్రీతికరమైన కార్తీకమాసంలో ఉసిరి చెట్టు దగ్గర భోజనం చేయడం సంప్రదాయంగా వస్తోంది.
కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద శ్రీ మహా విష్ణువుని పూజిస్తే అశ్వమేధ యాగం చేసినంత ఫలితం దక్కుతుందని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతుంటారు.
నాలుగు నెలల సుదీర్ఘ నిద్ర తరువాత కార్తీక మాసం ప్రభోదిని ఏకాదశి రోజున శ్రీమహా విష్ణువు మేల్కొంటారు. రెండవ రోజు అనగా క్షీరాబ్ది ద్వాదశి నాడు దేవతలందరూ వచ్చి కొలుస్తారు. పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. కార్తీక పౌర్ణమి రోజు వరకు సర్వ దేవతలు స్వామివారికి కైంకర్య సేవలను నిర్వహిస్తూనే ఉంటారు.
ఒక చెట్టు తనంతట తానుగా కొత్త జీవితాన్ని ఎలా ప్రారంభిస్తుందో.. మానవాళి కూడా తమ పతన దశ నుంచి స్వతంత్రంగా ఎదగాలనే సంకేతాన్ని వనాలు. ఇస్తాయని అలాంటి వనాల్లో కార్తీక మాసంలో భోజనం చేయడం వల్లవాటి నుంచి స్ఫూర్తి పొందినట్టవుతుందని పెద్దలు చెబుతుంటారు. అని అన్నారు
వన భోజనం అంటే.. చెట్ల మధ్య కూర్చుని ఆహారాన్ని స్వీకరించడం. అందులోనూ ఉసిరి చెట్టు కింద కూర్చుని భోజనం చేయడానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. దీనివల్ల ఆయా చెట్ల మీదుగా వీచే గాలి.. మనస్సుకు ప్రశాంతతను, హాయిని కలిగించడమే కాకుండా.. ఆరోగ్యాన్ని కూడా మెరుగు పరుస్తుందనే నమ్మకం ప్రజల్లో ఉంది. ప్రత్యేకించి- ఉసిరి చెట్టు నుంచి వచ్చే గాలి ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తుందని ఆయుర్వేద వైద్యులు చెపుతుంటారు అని ఆయన అన్నారు
ఈ కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి యరపతినేని శ్రీనివాసరావు చేతుల మీదుగా గిఫ్ట్ లను అందించారు.
ఈ కార్యక్రమంలో ఆత్మీయ అతిథులుగా కొత్త వెంకట సుబ్బారావు, కనిగిరి శ్రీనివాసరావు, గోంట్ల శ్రీనివాసరావు, అత్తలూరి సుబ్బారావు, మాజేటి సాత్విక్ మరియు అతిధులు గా,గుండా రామారావు, కొత్త రఘురామయ్య కట్టమూరు శంకర్రావు, ఎక్కల మోహనరావు, పెరుమళ్ళ రాజేష్ మరియు పిడుగురాళ్ల పట్టణ ఆర్యవైశ్య సంఘాలు మరియు యువజన సంఘాలు కార్యక్రమంలో పాల్గొన్నాయి
Discover more from
Subscribe to get the latest posts sent to your email.