నారద వర్తమాన సమాచారం
పల్నాడు జిల్లా పోలీసు కార్యాలయం,
నరసరావుపేట
పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు, ఐపీఎస్
ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుండి కుటుంబ, ఆర్ధిక, ఆస్తి తగాదాలు మొదలగు ఆయా సమస్యలకు సంబంధించి 60 ఫిర్యాదులు అందాయి.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన పరిష్కరించే విధంగా తక్షణ చర్యలు చేపట్టాలని, ప్రతి ఫిర్యాదుదారుని సమస్య పట్ల శ్రద్ధ వహించి, నిర్ణీత గడువులోగా సదరు ఫిర్యాదులను పరిష్కరించడానికి కృషి చేయాలని ఎస్పీ సూచించారు.
సత్తెనపల్లి మండలం రెంటపాళ్ళ గ్రామానికి చెందిన పల్లపు వెంకటేశ్వర్లు వయసు 75 సంవత్సరాలు అను అతనికి సంతానం లేనట్లు దానికి గాను అతని తమ్ముడు కుమారుడు అయిన పల్లపు వెంకటరావు, అతని భార్య వెంకటేశ్వర్లుకు చెందిన 1 – 50 సెంట్ల భూమిని మరియు నివాస గృహాన్ని కాజేయాలనే ఉద్దేశంతో దూషించి ఇబ్బంది పెడుతున్నందుకు
గాను ఎస్పీ ని న్యాయం చేయవలసిందిగా అర్జీ ఇవ్వడం జరిగింది.
బొల్లాపల్లి మండలం గండిగనుమల గ్రామానికి చెందిన కేతావత్ సూర్య నాయక్ భార్యకు ఉద్యోగం ఇప్పిస్తానని కొమ్ము పవన్ కుమార్ అని వ్యక్తి 3,50,000/- డబ్బులు తీసుకొని మోసం చేసినట్లు డబ్బులు అడిగితే చంపుతాను అని బెదిరిస్తున్నట్లు ఫిర్యాదు ఎస్పీ ని కలిసి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది.
తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం మండలం అనంతపురం గ్రామానికి చెందిన నూకల ఫణి కుమార్ కు వినుకొండ మండలం తిమ్మాయపాలెం లో 2.40 సెంట్లు పొలం ఉన్నట్లు, అంతట ఫిర్యాదు పేరు మీద ఉన్న పొలాన్ని తోట రామకృష్ణ, హర్ష సమంత అను వారు వారి పేరు మీద ఎక్కించుకొని ఫిర్యాదుని ఇబ్బంది పెడుతున్నట్లు కావున ఫిర్యాదు ఎస్పీ ని కలిసి అర్జీ ఇవ్వటం జరిగింది.
అచ్చంపేట గ్రామానికి చెందిన సందీప్ శివమ్మ సుమారు 2016 వ సంవత్సరంలో గ్రంధసిరి బుజ్జి అను వాని వద్ద లక్ష రూపాయలు అప్పు తీసుకొని వాటిని వడ్డీతో సహా తిరిగి ఇచ్చినట్లు, పూర్తి డబ్బులు చెల్లించి నను ఇంకా ఇవ్వమని తాగి వచ్చి ఇబ్బంది పెడుతున్నందుకుగాను తనకు న్యాయం చేయవలసిందిగా ఎస్పీ ని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది.
నరసరావుపేట శ్రీరాంపురం వీధికి చెందిన షేక్ ఖాసింపీర(అర్జీదారుడు) నరసరావుపేట టౌన్ లోని జామియా మసీదు ముసల్లీలు మరియు ముస్లిం సోదరులు అందరూ కలిసి షేక్ ఖాజావలి మరియు కొంతమంది కలిసి డబ్బులు వసూలు చేసి మసీదు కడతామని చెప్పి మసీదును పూర్తి చేయకుండా వదిలివేసినట్లు అడిగితే మీకు చేతనైంది చేసుకోమని అంటున్నట్లు సదరు విషయమై ఎస్పీ ని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది.
బొల్లాపల్లి మండలం వెంకటరెడ్డి పురం గ్రామానికి చెందిన వడితే నాయనా నాయక్ ఐదు నెలల క్రితం ఏటీఎంలో డబ్బులు తీసుకోవడానికి వినుకొండ పట్టణంలో గల HDFC ఏటీఎం కి వెళ్లగా ఫిర్యాది ఏటీఎంలో డబ్బులు తీయమని అక్కడ ఉన్న ఒక అపరిచిత వ్యక్తికి ఇవ్వగా సదరు వ్యక్తి ఫిర్యాదు ఏటీఎం నెంబర్, పాస్వర్డ్ డీటెయిల్స్ అన్ని కనుగొని పనిచేయని తన ఏటీఎం కార్డుని ఫిర్యాది కి ఇచ్చి డబ్బులు రావడం లేదని చెప్పి ఫిర్యాదు ఎటిఎంను ఆ వ్యక్తి తీసుకుని అక్రమంగా 90 వేల రూపాయలు డ్రా చేసి మోసం చేసినట్లు ఎస్పీ ని కలిసి న్యాయం చేయవలసింది గా అర్జీ ఇవ్వడమైనది.
గురజాల పట్టణానికి చెందిన పసుపులేటి మల్లికార్జున రావు కు ఉద్యోగం ఇప్పిస్తానని బత్తుల శ్రీనివాసరాజు అను అతను 16,00,000/- రూపాయలు తీసుకొనినట్లు, అదేవిధంగా మల్లికార్జున రావు యొక్క టెన్త్ ఇంటర్ డిగ్రీ సర్టిఫికెట్లు తీసుకొని ఉద్యోగం ఇప్పించకుండా మోసం చేశాడని ఫిర్యాదు తగిన న్యాయం చేయవలసిందిగా ఎస్పీ ని కలిసి అర్జీ ఇవ్వడం జరిగింది.
రొంపిచర్ల మండలం రామిరెడ్డి పాలెం గ్రామానికి చెందిన పరుచూరి వెంకట హనుమాన్ మూర్తి పిడుగురాళ్లలోని లలిత ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హోటల్ మేనేజ్మెంట్ వారు విదేశాలకు పంపిస్తామని 32 లక్షల రూపాయలు కట్టించుకుని మోసం చేసి,విదేశాలకు పంపించకుండా ఉన్నట్లు, అందుకుగాను తన డబ్బులు తిరిగి ఇవ్వమని అడగగా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నట్లు కావున తనకు తగిన న్యాయం చేయవలసిందిగా ఎస్పీ ని కలిసి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ప్రజలకు వారి ఫిర్యాదులను రాసి పెట్టడంలో పోలీస్ సిబ్బంది సహాయ సహకారాలు అందించారు మరియు భోజన ఏర్పాట్లను చేసినారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.