నారద వర్తమాన సమాచారం
పల్నాడు జిల్లా పోలీసు కార్యాలయం,
నరసరావుపేట
పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు, ఐపీఎస్
ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుండి కుటుంబ, ఆర్ధిక, ఆస్తి తగాదాలు మొదలగు ఆయా సమస్యలకు సంబంధించి 75 ఫిర్యాదులు అందాయి.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన పరిష్కరించే విధంగా తక్షణ చర్యలు చేపట్టాలని, ప్రతి ఫిర్యాదుదారుని సమస్య పట్ల శ్రద్ధ వహించి, నిర్ణీత గడువులోగా సదరు ఫిర్యాదులను పరిష్కరించడానికి కృషి చేయాలని ఎస్పీ సూచించారు.
క్రోసూరు మండలం విప్పర్ల గ్రామానికి చెందిన నర్రా రమేష్ ఈ సంవత్సరం
లక్ష్మీశెట్టి రవికుమార్, తన్నీరు మార్కండేయులు అను వారికి 300 క్వింటాళ్ల పత్తి మరియు మిర్చి 360 క్వింటాళ్లు అమ్మగా అడ్వాన్సు కింద 5,00,000/- లు మరలా బ్యాంకు ఖాతాలో 4,00,000/- రూపాయలు జమ చేసినట్లు, ఫిర్యాదు ఇచ్చిన సరుకు 70 లక్షల రూపాయలకు గాను 9 లక్షల రూపాయలు ఇచ్చి ఇంకను 61,00,000/- లు రావాల్సి ఉండగా డబ్బులు అడిగేందుకు వెళ్లిన తనను కొట్టినట్లు దానికి గాను ఎస్పీ ని న్యాయం చేయవలసిందిగా అర్జీ ఇవ్వడం జరిగింది.
ఎన్టీఆర్ జిల్లా నందిగం గ్రామానికి చెందిన షేక్ నూర్జహాన్ కు నరసరావుపేట బరంపేట నందు 50 సెంట్లు స్థలం ఉండగా దానిని పఠాన్ లాలు సాహెబ్, షేక్ ఆదం వలి అనువారు ఆ స్థలాన్ని వారి పేరు మీద దొంగ రిజిస్ట్రేషన్ చేయించుకుని ఫిర్యాదుని మానసికంగా హింసించుచున్నారని ఈ విషయమై ఫిర్యాదు ఎస్పీ ని కలిసి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది.
నరసరావుపేట మండలం ఉప్పలపాడు గ్రామానికి చెందిన కుంభ సత్యనారాయణ అను అతను రైల్వేలో ఉద్యోగం నిమిత్తం తన దూరపు బంధువు అయిన మేడ గోపాల రావుకు సుమారు 3,00,000/- రూపాయలు సంవత్సరం క్రితం ఇచ్చినట్లు, డబ్బులు ఇవ్వకుండా కాలయాపన చేస్తూ ఇబ్బందులు పెట్టుచున్నందుకు గాను ఫిర్యాదు తగిన న్యాయం కొరకు ఎస్పీ ని కలిసి అర్జీ ఇవ్వటం జరిగింది.
పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు గ్రామానికి చెందిన సయ్యద్ కరీమూన్ ఆమెకి ముగ్గురు కుమారులు ఉండగా సదరు ఫిర్యాది రెండవ కుమారుడు అయిన చిన నాగూర్ సైదా మద్యం త్రాగి వచ్చి ఫిర్యాదు పేరు మీద ఉన్న ఆస్తిని వ్రాయమని
కొడుతున్నట్లుగా, చిన నాగూర్ సైదా తో పాటు తన అనుచరులైన హనీఫ్ సైదా, బాజీ, పాండు అను వాళ్లు కూడా ఫిర్యాదిని ఇబ్బంది పెడుతున్నందుకు గాను ఎస్పీ ని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది.
నరసరావుపేట పెద్ద చెరువుకు చెందిన బండి రామబ్రహ్మం, గుంటకల శ్రీనివాసరావు, కొమ్ము అన్నపూర్ణ రావు అనువారు తమ పిల్లలకు గ్రామ సచివాలయం పోస్టు, హైకోర్టు, జిల్లా కోర్టులలో సభార్డినేట్ పోస్టు ఇప్పిస్తానని సిరికొండ వెంకట్రావు మన వ్యక్తి ఫిర్యాదుల వద్ద నుండి 36,40,000/- రూపాయలు తీసుకొని జాబ్ ఇప్పించకుండా, తిరిగి డబ్బులు ఇవ్వకుండా మోసం చేసినట్లు సదరు విషయమై ఎస్పీ ని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది.
అమరావతి మండలం మునుగోడు గ్రామానికి చెందిన బంకా సంధ్యారాణి కి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి పొన్నగంటి రమ్యశ్రీ ఆమె 2,14,000/- రూపాయలు తీసుకుని ఉద్యోగం ఇప్పించకుండా మోసం చేసినట్లు కావున చట్టపరంగా చర్యలు తీసుకోనవలసింది గా ఎస్పీ ని కలిసి అర్జీ ఇవ్వడమైనది.
చిలకలూరిపేట కు చెందిన గోపిదేశి కోటేశ్వరమ్మ కుమారుడు మరియు కోడలు ఫిర్యాదు అయిన గోపిదేశి కోటేశ్వరమ్మ చనిపోయిందని నకిలీ పత్రములు పెట్టి ఫిర్యాదు యొక్క ఆస్తి అంతటిని అమ్మి వేసి ఫిర్యాదుని పట్టించుకోకుండా ఇంటి నుండి గెంటి వేయగా ఫిర్యాదు భిక్షాటన చేసుకుంటూ ఆంజనేయస్వామి గుడి వద్ద ఉంటున్నట్లు ఎస్పీ ని కలిసి అర్జీ ఇవ్వడమైనది.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ప్రజలకు వారి ఫిర్యాదులను రాసి పెట్టడంలో పోలీస్ సిబ్బంది సహాయ సహకారాలు అందించారు మరియు దూర ప్రాంతాల నుండి వచ్చిన అర్జీ దారులకు దాతల సహాయంతో భోజన ఏర్పాట్లను చేసినారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.