నారద వర్తమాన సమాచారం
మాదిగ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉండవల్లి శ్రీదేవి ప్రమాణ స్వీకారం.
జనసంద్రం నడుమ కోలా హలంగాంగా ప్రమాణ స్వీకార కార్యక్రమం.
హాజరైన మంత్రి కొల్లు రవీంద్ర మరియు ఇతర ప్రముఖులు.
ఇంటి నుండి ర్యాలీగా బయలుదేరి మార్గమధ్యంలో భారీ జన సంద్రోహం మధ్య డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరియు భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రావ్ విగ్రహాలకు పూలమాలతో అలంకరించి నివాళులర్పించారు . అనంతరం కార్యాలయంలో పూజా కార్యక్రమం నిర్వహించి ప్రమాణ స్వీకారం చేశారు. విచ్చేసిన ప్రముఖులు మరియు కూటమి కార్యకర్తలు ఇతర తన సామాజిక వర్గ నాయకుల నుండి శుభాకాంక్షలు అందుకుని కోలాహలంగా గడపడం జరిగింది.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పదవీకాలంలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను వివిధ పథకాలకు నవరత్నాల పేరుతో ఎస్సీలకు రావలసిన పథకాలను పూర్తిగా ఎత్తివేసి వారిని ఆర్థికంగా ఎదుగుదల లేకుండా చేశారని ప్రస్తుతం ఏర్పడిన కూటమి ప్రభుత్వం పూర్తి సహయ సహకారాలు అందించి సబ్ ప్లాన్ నిధులు సక్రమంగా ఆయా వర్గాలకు చేరేలా నాపై నమ్మకం ఉంచి మాదిగ కార్పొరేషన్ చైర్మన్ పదవి అనే పెద్ద బాధ్యతను నా బుజ స్కందాలపై ఉంచి అట్టడుగు జీవిస్తున్న నా జాతి బిడ్డలకు ఆర్థిక భరోసా కల్పించేలా ముందు ముందు రాబోవు రోజులలో ప్రతి గ్రామాన్ని సందర్శించి న్యాయం చేస్తానని తెలిపారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.