Thursday, November 21, 2024

రాజమహేంద్రవరం టూటౌన్ సీఐ దుర్గారావు సస్పెన్షన్…

నారద వర్తమాన సమాచారం

రాజమహేంద్రవరం టూటౌన్ సీఐ దుర్గారావు సస్పెన్షన్…

వైసిపి ప్రభుత్వం లో గుడివాడ టౌన్ సిఐగా పనిచేస్తూ లంచం వసూళ్ల కేసులో ఐజీ ఆదేశాలు…

రాజమహేంద్రవరం రెండో పట్టణ సీఐ వి. దుర్గారావును సస్పెండ్ చేస్తూ ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ ఉత్తర్వులు జారీ …

గుడివాడ రెండో పట్టణ సీఐగా దుర్గారావు విధులు నిర్వర్తిస్తున్నప్పుడు 2022లో భూ వివాదంపై ఫిర్యాదు అందగా, రెండు వర్గాలకు సంబంధించి రూ.30 లక్షలకు వివాదాన్ని పరిష్కరించారు.

ఈ సమయంలో సొమ్ము ఇచ్చినవారికి అనుకూలంగా ఉండి ఫిర్యాదుదారు నుంచి కొన్ని డాక్యుమెంట్లను బలవంతంగా తీసుకుని, వ్యతిరేక వర్గానికి ఇచ్చారు. ఆ డాక్యుమెంట్లు వెనక్కి ఇప్పించాలని ఫిర్యాదుదారు సీఐని కోరగా డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించడం, దర్యాప్తులో నేరం తేలడంతో సీఐ పై క్రిమినల్ కేసు పెట్టి సస్పెండ్కు సిఫార్స్ చేశారని ఐజీ తెలిపారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version