నారద వర్తమాన సమాచారం
కోర్టు విధులను బహిష్కరించిన చిలకలూరిపేట బార్ అసోసియేషన్ న్యాయవాదులు
నడిరోడ్డుపై లాయరు పై కత్తితో దాడి చేసిన అసిస్టెంట్
న్యాయవాది కన్నన్ పై దాడి
రాష్ట్రంలో గత కొద్ది రోజుల నుండి జరుగుతున్నటువంటి దాడుల విషయంలో ముఖ్యంగా వైజాగ్ లో న్యాయ విద్యార్థిని తోటి విద్యార్థులు ఒకరి తర్వాత ఒకరు బెదిరించి లైంగిక దాడి చేశారు,
విజయవాడలో సెర్చ్ వారంట్ లేకుండా న్యాయవాది ఇంట్లో కీ జొరబడి అన్వేషించటం అలాగే కోర్టు దగ్గర న్యాయవాదిని అతని అసిస్టెంట్ కర్కశంగా నరికి చంపడం అనే విషయాల మీద నిరసన తెలియజేస్తూ ఈరోజు చిలకలూరిపేట బార్ అసోసియేషన్ సభ్యులు అందరూ ప్రెసిడెంట్ సాప ఆదినారాయణ ఆధ్వర్యంలో కోర్టు విధులను బహిష్కరించడం జరిగినదని తెలియజేశారు.
బహిష్కరణ కార్యక్రమంలో చిలకలూరిపేట బార్ అసోసియేషన్ సభ్యులు న్యాయవాదులు అందరు పాల్గొని నిరసన తెలియజేశారు.