నారద వర్తమాన సమాచారం
ప్రజల డేటా పక్కదారి పడుతుందని నిరూపిస్తే ₹10 కోట్లు ఇస్తానన్నారు
తన సొంత డబ్బుల్ని చెక్‌గా అందిస్తానన్నారు లోకేష్!
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో టెక్నాలజీని వాడుకుని పాలనలో అనేక మార్పులు తీసుకొస్తున్నామన్నారు. ఇటీవల ప్రారంభించిన వాట్సాప్ పాలన ద్వారా ప్రజల డేటా చౌర్యం జరుగుతోందని నిరూపిస్తే తాను ₹10 కోట్లు కానుకగా ఇస్తానని సవాల్ చేశారు.
ఢిల్లీలో కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన తర్వాత ఆయన.. వాట్సాప్ పాలన అంశంపై వైఎస్సార్‌సీపీ నేతల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. వైఎస్ జగన్ ఫోన్ వాడరని చెప్పారని.. ఇప్పుడు వాట్సాప్ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఫోన్ లేని వ్యక్తికి వాట్సాప్ గురించి ఎలా తెలుస్తుందని సెటైర్లు పేల్చారు..!
2014-2019 మధ్య తాను ఐటీ మంత్రిగా ఉన్న సమయంలో కూడా డేటా చోరీ జరిగిందని వైఎస్సార్‌సీపీ ఆరోపించిందని.. గత ఐదేళ్లు అధికారంలో ఉన్నా ఎందుకు నిరూపించలేకపోయారని ప్రశ్నించారు. కేంద్రం ఆధ్వర్యంలోని డిజీలాకర్‌లో సర్టిఫికెట్లు దాచుకోవడంపై కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ సూచనతో త్వరలో ఎంవోయూ చేసుకుంటామన్నారు…
వాట్సాప్ గవర్నెన్స్‌పై మరికొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆసక్తిగా ఉన్నాయని.. ఈ మేరకు ఆ సంస్థ యాజమాన్యంతో చర్చిస్తున్నాయన్నారు. తమకు ప్రజల డేటా అవసరం లేదని.. ఓటర్ లిస్టు మాత్రమే కావాలని.. అది పబ్లిక్ డాక్యుమెంట్ అన్నారు! గత ప్రభుత్వం పనికిమాలిన కేసులు పెట్టి చంద్రబాబును జైల్లో ఉంచారని.. టీడీపీ కార్యకర్తలపైనా అక్రమ కేసులు పెట్టించి వేధించారన్నారు.
ఏపీకి రాజధాని ఒకటే.. అభివృద్ధి వికేంద్రీకరణ తమ నినాదమన్నారు. అందుకే జిల్లాల వారీగా పరిశ్రమలు, కంపెనీలను ఏర్పాటు చేస్తున్నామనీ ఈ సందర్భంగా పేర్కొన్నారు!!
Discover more from
Subscribe to get the latest posts sent to your email.