నారద వర్తమాన సమాచారం
తనని ప్రేమించలేదని క్లాస్ రూమ్ లోనే టీచర్ను పొడిచి చంపిన ప్రేమోన్మాది..
తనని ప్రేమించలేదని కోపంతో టీచర్ను తరగతి గదిలోనే పొడిచి చంపాడో ఉన్మాది. వివరాలు పరిశీలిస్తే తమిళనాడులోని తంజవూరు మల్లిపట్నం ప్రభుత్వం ఉన్నత పాఠశాలలో బుధవారం (నవంబర్ 20) చోటు చేసుకుంది. రమణి అనే అనే ఉపాధ్యాయురాలు ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తుంది. ఈ నేపథ్యంలో మదన్ కుమార్ అనే వ్యక్తి రమణిని ప్రేమిస్తున్నానని వెంటపడుతున్నాడు.ఈ క్రమంలో పెళ్లి ప్రతిపాదనతో ఆమె కుటుంబాన్ని సంప్రదించాడు. ఈ విషమై ఆమె తల్లిదండ్రులు తిరస్కరించారు. దీంతో కోపోద్రిక్తుడైన మదన్ కత్తితో పాఠశాలకు వచ్చాడు. తరగతి గదిలో పాఠాలు బోధిస్తున్న రమణి మెడపై కత్తితో పొడిచాడు. తెరుకునే లోపే రమణి రక్తమడుగులో పడిపోయింది. గమనించిన సిబ్బంది, తోటి ఉపాధ్యాయులు ఆమెను దగ్గర్లోని దవాఖానాకు తరలించారు. ఆస్పత్రికి చేరుకునేలోపే మృతి చెందిందని వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. మదన్ కుమార్ను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. ఈ ఘటనపై ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఖండించారు. హింసను సహించబోమని, నేరస్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇదిలావుండగా, ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె పళనిస్వామి హత్యను తీవ్రంగా ఖండించారు. రమణిని మృతి తో సిబ్బంది, తోటి ఉపాధ్యాయులు కన్నీటి పర్యంతమయ్యారు. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా విద్యాసంస్థల్లో భద్రతను పటిష్టం చేయాలని కోరారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఉంది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.