నారద వర్తమాన సమాచారం
పల్నాడు జిల్లా పోలీస్…
పల్నాడు జిల్లాలోని మాచర్ల,దాచేపల్లి పోలీస్ స్టేషన్ లను తనిఖీ చేసిన పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాస రావు ఐపిఎస్
పోలీస్ స్టేషన్ తనిఖీల లో భాగంగా మాచర్ల అర్బన్ మరియు దాచేపల్లి పోలీస్ స్టేషన్ లను తనిఖీ చేసినారు.
లాకప్ మరియు స్టేషన్ పరిసరాలు తనిఖీ చేసినారు. అనుమతి లేకుండా లాకప్ నందు ఎవరిని ఉంచవద్దని ఎస్పీ స్టేషన్ అధికారులకు తెలిపారు.
అదేవిధంగా దాచేపల్లి స్టేషన్ నందు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన అర్జీదారులతో ఎస్పీ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మొదలగు అంశాలను గూర్చి క్షుణ్ణంగా పరిశీలించారు.
స్టేషన్ నందు పెండింగ్ ఉన్న రికార్డు పనులకు సంబంధించి అధికారులకు తగిన సూచనలు చేశారు.
మాచర్ల దాచేపల్లి పోలీసు స్టేషన్ పరిధి లోని చెక్ పోస్ట్ ల నందు సిబ్బంది అప్రమత్తంగా ఉండి అక్రమ మద్యం, అక్రమ ఇసుక, గంజాయి మొదలైన నిషేధిత పదార్థాల అక్రమ రవాణా, నిల్వలుపై దృష్టి సారించాలని అధికారులకు పలు సూచనలు చేశారు.
దొంగతనాల నియంత్రణపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని శ్రీ ఎస్పీ తెలిపారు.
పోలీస్ అధికారులు మరియు సిబ్బంది యొక్క యోగక్షేమాల విషయంలో ఎటువంటి సమస్య ఉన్నా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, క్షేత్ర స్థాయిలో పని చేసే సిబ్బందే వ్యవస్థకు వెన్నెముక అని తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో ఎస్పీ తో పాటు గురజాల డిఎస్పీ జగదీష్ మాచర్ల అర్బన్ సిఐ ప్రభాకర్ మాచర్ల రూరల్ సీఐ నఫీజ్ బాషా దాచేపల్లి ఇన్చార్జి సిఐ భాస్కర్ మరియు యస్.బి సిఐ బండారు సురేష్ బాబు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.