నారద వర్తమాన సమాచారం
నేడు 75వ రాజ్యాంగ దినోత్సవం
భారత రాజ్యాంగం గురించి ప్రజలకు అవగాహన కల్పించడం, రాజ్యాంగం, అంబేద్కర్ ఆలోచనలు, భావనల ప్రాముఖ్యతను వ్యాప్తి చేసే లక్ష్యంతో ప్రతి సంవత్సరం రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపు కుంటారు.
రాజ్యాంగ దినోత్సవాన్ని మొదటిసారిగా ఎప్పుడు జరుపుకున్నారు.. ఈ రోజును జరుపుకోవడానికి కారణం ఏమిటి ? భారత రాజ్యాంగం యొక్క గొప్పతనం ఏమిటి? పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్రజాస్వామ్య దేశం కోసం.. దేశంలోని పౌరుల హక్కు లు, విధులను రాజ్యాంగం నిర్ణయిస్తుంది.
ఇది ప్రభుత్వంలోని వివిధ హక్కులు, విధులను కూడా నిర్వచిస్తుంది. రాజ్యాంగం అనేది ఏ దేశంలోనైనా పాలనా వ్యవస్థ, రాష్ట్రాన్ని అమలు చేయడానికి రూపొందించిన పత్రం. రాజ్యాంగం ఆవశ్యకతను గ్రహించి, భారతదేశం కూడా స్వాతంత్ర్యం తర్వాత రాజ్యాంగాన్ని ఆమోదించింది.
రాజ్యాంగాన్ని రూపొందిం చడానికి, అనేక దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి, వారి నుండి మంచి నియమాలు, చట్టాలను సంగ్రహించి భారత రాజ్యాంగాన్ని రూపొందించారు. భారత రాజ్యాంగం గురించి ప్రజల కు అవగాహన కల్పించడం, రాజ్యాంగం, అంబేద్కర్ ఆలోచనలు, భావనల ప్రాముఖ్యతను వ్యాప్తి చేసే లక్ష్యంతో ప్రతి సంవత్సరం రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపు కుంటారు.
రాజ్యాంగ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?
భారతదేశంలో ప్రతి సంవత్సరం నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటారు. 1949వ సంవత్సరంలో ఇదే రోజున భారత రాజ్యాంగం ఆమో దించారు. 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రాజ్యాం గం ఆవశ్యకత ఏర్పడింది.
రాజ్యాంగాన్ని రూపొందిం చడానికి రెండు సంవత్స రాల 11 నెలల 18 రోజులు పట్టింది. ఆ తర్వాత 1949 జనవరి 26న రిపబ్లిక్ ఆఫ్ ఇండియా రాజ్యాంగం సిద్ధమైంది. అయితే, ఇది అధికారికంగా 26 జనవరి 1950న అమలులోకి వచ్చింది.
ఈ రోజును ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవంగా జరుపు కుంటారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.