నారద వర్తమాన సమాచారం
మృత్యువుతో పోరాడి ఓడిన 9వ తరగతి విద్యార్థిని
అసిఫాబాద్ జిల్లా:
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్‌కు గురై ఆస్పత్రి లో చికిత్స పొందుతున్న 9వ తరగతి విద్యార్థిని శైలజ (16) సోమవారం సాయంత్రం మృతి చెందింది.
గత కొన్ని రోజులుగా హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమించి, తుది శ్వాస విడిచారు. కాగా, అక్టోబర్ 30న పాఠశాలలో భోజనం చేసిన అనంతరం దాదాపు 60 మంది విద్యార్థి నులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
విరేచనాలు, వాంతులతో అనారోగ్యానికి గురి కాగా వారందరినీ సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిం చారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమించడంతో ఈ నెల 5న మెరుగైన వైద్యం కోసం పంజాగుట్ట లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
తొమ్మిదో తరగతి బాలిక సి.శైలజకు వైద్యులు అప్ప టి నుంచి వెంటిలేటర్‌పైనే చికిత్స అందిస్తూ వచ్చారు. చికిత్సకు శరీరం సహకరిం చడం లేదని.. పరిస్థితి విషమించడంతో సోమవారం సాయంత్రం బాలిక మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.
విద్యార్థిని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. శైలజ మృతితో బంధువులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ క్రమంలో గాంధీ ఆస్పత్రి వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు భారీగా మోహరించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.