నారద వర్తమాన సమాచారం
నరసరావుపేట
దారి కాచి దారిన వచ్చే వ్యక్తులను అడ్డగించి వారిని కొట్టి వారి వద్ద ఉన్న బంగారం,డబ్బు దొంగలించిన కేసులో ముద్దాయిలకు 5సంవత్సరముల ఖైదు మరియు 5000/- రూపాయల జరిమాన విదించిన న్యాయస్థానం….
నిందితులకు జైలు శిక్ష పడే విధంగా చర్యలు తీసుకున్న పోలీస్ అధికారులు, కోర్టు మానిటరింగ్ సిబ్బందిని అభినందించిన పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాసరావు ఐపీఎస్
సత్ఫలితాలిస్తున్న “ట్రైల్ కేసుల ప్రత్యేక పర్యవేక్షణ” పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాసరావు IPS
ఎడ్లపాడు PS 1.Cr.No.251/2021 U/Sec 341,395,324 r/w 34 IPC (ఉప్పరపాలెం)
2.Cr.No : 253/2021 U/Sec 341,323,395 r/w 34 IPC.Section added 379 IPC & 25 Arms Act (సొలస గ్రామం).
ముద్దాయిలు :-
1) A1..ఆకుల లింగమయ్య అలియాస్ పెద్ద లింగమయ్య తండ్రి భజరంగ 24 సంవత్సరాలు కులము యానాది బండి ఆత్మకూరు గ్రామము మరియు మండలము ప్రస్తుతము యానాది సంఘం మహానంది రోడ్ నంద్యాల పట్టణము కర్నూలు జిల్లా
2) A2..దాసరి ఓబులేసు తండ్రి వీరన్న, 37 సంవత్సరాలు కులము:చెంచు,
చిందుకూరు గ్రామం, గడివేముల మండలం, కర్నూలు జిల్లా ప్రస్తుతము
అమ్మవరం గ్రామం, బోయగంటి తిప్పా హిల్ ఫారెస్ట్ ఏరియా, గిద్దలూరు మండలం
3) A4..దాసరి లింగమయ్య @ చిన్న లింగమయ్య తండ్రి జమ్ములు, 20సం, కులము:చెంచు,
చిందుకూరు గ్రామం, గడివేముల మండలం, కర్నూలు జిల్లా. ( Juvenile)
4) A5..దాసరి అంకన్న తండ్రి నాగులేటి, 22సం, కులము:చెంచు, నెమలికుంట గ్రామము బండి ఆత్మకూరు మండలం, కర్నూలు జిల్లా (Absconding)
5) A6…చెంచు మేకల హనుమంతు తండ్రి పెద్ద హనుమంతు, వయస్సు:21సం, కులము:చెంచు, చెంచు కాలనీ, పాణ్యం గ్రామం & మండలం కర్నూలు జిల్లా. (Absconding)
6) A8. ఇండ్ల రమణయ్య@
యానాది వెంకటరమణ
@వెంకటరమణయ్య@పెద్ద కొండయ్య తండ్రి వెంకటేశ్వర్లు, 52 సంవత్సరాలు, కులము : యానాది, వినాయక గుడి దగ్గర మహానంది రోడ్డు నంద్యాల టౌన్
శిక్ష: 5సంవత్సరముల ఖైదు మరియు 5,000/- జరిమాన.జరిమాన చెల్లించని ఎడల మరియొక నెల రోజులు అదనంగా జైలు శిక్ష
వివరణ:-
పైన తెలిపిన ముద్దాయిలందరూ ఎడ్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉప్పరపాలెం మరియు సొలస గ్రామాల్లో దారి కాచి, దారిన వచ్చే వ్యక్తులను అడ్డగించి, వారిని కొట్టి వారి వద్ద ఉన్న బంగారము, డబ్బు దొంగలించినందుకు గాను ఫిర్యాదులు ఇచ్చిన రిపోర్టు మేరకు కేసులు నమోదు చెయ్యడమైనది. సదరు కేసులకు సంబందించి అప్పటి దర్యాప్తు అధికారి అయిన ఎస్ఐ రాంబాబు గారు, చిలకలూరిపేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ M. సుబ్బారావు విచారణ పూర్తి చేసి కోర్టు నందు ఛార్జ్ షీట్ దాఖలు చేయడమైనది.
సదరు కేసుపై పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాస రావు IPS ఆదేశాలమేరకు ట్రైల్ మానిటరింగ్ ద్వారా నరసరావు పేట DSP K.నాగేశ్వర రావు పర్యవేక్షణలో చిలకలూరి పేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ B. సుబ్బనాయుడు మరియు ఎడ్లపాడు SI V.బాలకృష్ణ ఆద్వర్యంలో ఎడ్లపాడు పోలీసు వారు సరైన సాక్షాదారులతో నిరూపించగా సదరు కేసుకు సంబందించి ప్రిన్సిపాల్ అసిస్టెంట్
సేషన్స్ జడ్జి కోర్టు,
నరసరావు పేట జడ్జి పూర్ణిమ ముద్దాయిలు అయిన
A1 ఆకుల లింగమయ్య @ పెద్ద లింగమయ్య,
A2 దాసరి
ఓబులేసు,
A8 ఇండ్ల రమణయ్య@ యానాది వెంకట రమణ @ పెద్ద కొండయ్య
అను ముగ్గురు ముద్దాయిలకు 5సంవత్సరాల ఖైదు మరియు 5,000/- జరిమాన, జరిమాన చెల్లించని ఎడల అదనంగా మరియొక నెల రోజుల పాటు శిక్ష విదిస్తూ ఉత్తరులు జారీచేశారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.