Saturday, December 28, 2024

విజయవంతంగా ముగిసిన పల్నాడు జిల్లా పోలీస్ వార్షిక గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ -2024..


నారద వర్తమాన సమాచారం

పల్నాడు జిల్లా

అద్భుతమైన క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించారు…ఇదే స్ఫూర్తిని కొనసాగించాలి.

విజయవంతంగా ముగిసిన పల్నాడు జిల్లా పోలీస్ వార్షిక గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ -2024..

విజేతలకు ట్రోఫీలు, మెడల్స్ మరియు మెమెంటోలు అందచేసి, అభినందించిన గుంటూరు రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సర్వ శ్రేష్ఠ త్రిపాఠి ఐపిఎస్ పల్నాడు జిల్లా ఎస్పీ .కంచి శ్రీనివాస రావు ఐపీఎస్ ,జాయింట్ కలెక్టర్ సూరజ్ గనొరె ఐఏయస్ మరియు పల్నాడు జిల్లా DFO కృష్ణ ప్రియ

పోలీస్ స్పోర్ట్స్ మీట్ లో ఓవరాల్ ఛాంపియన్ గా నిలిచిన జిల్లా ఆర్మ్డ్ రిజర్వు జట్టు.

టగ్ ఆఫ్ వార్ లో విజయం సాధించిన ఎస్పీ  జట్టు..

పల్నాడు జిల్లా నరసరావు పేట కోడెల శివప్రసాద్ స్టేడియం మైదానం నందు రెండు రోజులుగా నిర్వహించిన పోలీస్ వార్షిక గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ ఆదివారం సాయంత్రం ముగింపు వేడుకల కార్యక్రమానికి అతిథిగా ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సర్వ శ్రేష్ఠ త్రిపాఠి
ఐపియస్ ముఖ్య అతిధిలుగా హాజరయ్యారు.

గత రెండు రోజులుగా నిర్వహించిన క్రీడా పోటీలలో జిల్లా పోలీసు అధికారులు మరియు సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.

నిర్వహించిన అన్ని క్రీడా పోటీలు కూడా అత్యంత ఉత్కంఠ భరితంగా సాగాయి.

ఫైనల్ మ్యాచ్ లను గుంటూరు రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్  సర్వ శ్రేష్ఠ త్రిపాఠి ఐపియస్ ,పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాస రావు ఐపియస్ , జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే ఐఏయస్ ,DFO  కృష్ణ ప్రియ  ఆసక్తిగా తిలకించారు.

పోలీసు అధికారులతో టగ్ ఆఫ్ వార్ లో  ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సర్వ శ్రేష్ఠ త్రిపాఠి ఐ.పి.యస్  ఉత్సాహంగా ప్రోత్సహించడం జరిగింది.

అనంతరం మూడు పోలీస్ సబ్ డివిజన్లు, సత్తెనపల్లి , నరసరావు పేట, గురజాల, మరియు ఆర్మ్డ్ రిజర్వ్ నుండి పాల్గొన్న పోలీసు క్రీడాకారులు ముగింపు మార్చ్ పాస్ట్ చేసి గుంటూరు ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్  సర్వ శ్రేష్ఠ త్రిపాఠి కి గౌరవ వందనం చేశారు.

పోలీస్ స్పోర్ట్స్ మీట్ లో, వ్యక్తిగత ఛాంపియన్ గా గురజాల సబ్ డివిజన్ వెల్దుర్తి ఎస్సై షేక్.సమందర్ అలి మరియు ఏఆర్ పిసి నాగరాజు నిలిచారు.

ఓవరాల్ ఛాంపియన్ గా జిల్లా ఆర్మ్డ్ రిజర్వు జట్టు నిలిచింది.
స్పోర్ట్స్ మీట్ లో విజేతలుగా నిలిచిన జట్టులకు మరియు ఇతర విజేతలకు ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ సర్వ శ్రేష్ఠ త్రిపాఠి ఐపియస్ ,పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాస రావు
ఐపియస్ , పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ గానోరె
ఐఏయస్,పల్నాడు DFO కృష్ణ ప్రియ  ట్రోఫీలు, మెడల్స్ మరియు మెమెంటోలు అందచేసి ప్రత్యేకంగా అభినందించారు.

అనంతరం స్పోర్ట్స్ మీట్ కు ప్రతీకగా సూచించే పోలీస్ పతాకాన్ని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సర్వ శ్రేష్ఠ త్రిపాఠి ఐ పి యస్ కి క్రీడాకారులు అందించారు.

జిల్లా ఎస్పీ  మాట్లాడుతూ జిల్లా పోలీసు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2024 పండుగ వాతావరణంలో ఉత్సాహంగా కొనసాగాయని సంతోషం వ్యక్తం చేశారు.

క్రీడలతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని, ప్రతి రోజు చురుకుగా విధులు నిర్వర్తించేందుకు
క్రీడలు ఎంతో దోహదపడతాయన్నారు.
క్రీడాస్ఫూర్తి వెల్లివిరిసేలా క్రీడాకారులు పోటీల్లో పాల్గొనడం అభినందనీయమన్నారు.
దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరికి క్రీడలు,వ్యాయామం ఒక భాగంగా ఉండాలని,ముఖ్యంగా పోలీస్ శాఖలో పనిచేసే ప్రతి ఒక్కరూ తమ శారీరక దృఢత్వాన్ని కాపాడుకోవడానికి ఎదో ఒక వ్యాయామం గానీ, క్రీడను గానీ అలవాటుగా చేసుకోవాలని సూచించారు.
క్రీడలలో గెలుపోటములు సాధారణమని, క్రీడా స్పూర్తితో ఓటమిని కూడా ఆనందంగా స్వీకరించినప్పుడే జీవితంలో కూడా ఒడిదుడుకులను ఎదుర్కోగలమని అన్నారు.
పోలీస్ విధులు టీం వర్క్ లాగా ఉంటుందని, క్రీడల్లో అయినా, పోలీస్ విధుల్లోనైనా కలిసికట్టుగా సమన్వయంతో పనిచేస్తే విజయం సాధించగలమని పేర్కొన్నారు.
పోలీస్ సిబ్బంది వారి కుటుంబ సభ్యులు మంచి ఆరోగ్యంతో ఉండాలని మంచి ఆహారపు అలవాట్లు అలవరచుకోవాలని, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని, ఒత్తిడిని అధిగమించడానికి యోగ, మెడిటేషన్ వంటివి చేయాలని సూచించారు.

అందరూ శారీరక ఫిట్ నెస్ కు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.

ఈ స్పోర్ట్స్ మీట్ ను విజయవంతంగా నిర్వహించడంలో కృషి చేసిన పోలీసు అధికారులకు, ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్లకు మరియు పోలీసు సిబ్బందికి, జిల్లా ఎస్పీ  మెమెంటోలను అందజేసి అభినందించారు.

క్రీడల ముగింపు వేడుకల్లో భాగంగా క్యాంప్ ఫైర్ ఏర్పాటు చేసినారు.

ఈ కార్యక్రమంలో గుంటూరు రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్  సర్వ శ్రేష్ఠ త్రిపాఠి ఐపిఎస్ తో పాటు పల్నాడు జిల్లా ఎస్పీ  కంచి శ్రీనివాస రావు ఐపిఎస్ , అడ్మిన్ ఎస్పీ J.V. సంతోష్ , AR అడిషనల్ ఎస్పీ సత్తి రాజు ,
పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే
ఐఎయస్ ,DFO కృష్ణ ప్రియ , సత్తెనపల్లి డిఎస్పీ హనుమంత రావు ,నరసరావు పేట డిఎస్పీ నాగేశ్వర రావు , ఏఆర్ డిఎస్పీ. . మహాత్మ గాంధీ రెడ్డి , అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ KVD రామారావు , జిల్లాలోని సీఐలు, ఆర్ఐ లు, ఎస్ఐ లు, ఆర్ఎస్ఐ లు, మరియు ఇతర అధికారులు, పోలీసు సిబ్బంది, పిజికల్ డైరెక్టర్లు పాల్గొన్నారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version