నారద వర్తమాన సమాచారం
చత్తీస్ ఘడ్ లో మాజీ సర్పంచులను కిడ్నాప్ చేసి హతమార్చిన మావోయిస్టులు
ఖమ్మం జిల్లా:
ఛత్తీస్‌గఢ్‌లో రాష్ట్రంలోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన బీజాపూర్ జిల్లాలో ఇద్దరు మాజీ సర్పంచ్‌లను మావోయి స్టులు కిడ్నాప్ చేసి హత్య చేశారు. జిల్లాలోని నైమెడ్, భైరామ్‌గఢ్ పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో మాజీ సర్పంచ్ సుఖ్‌రామ్ అవలం, సుకాలు ఫర్సాలను గురువారం రాత్రి మావోయిస్టులు కిడ్నాప్ చేసి హతమార్చినట్లు పోలీసు అధికారులు తెలిపారు.
మృతులు బీజేపీ కార్యక ర్తలని పోలీసు క్యాంపును ఏర్పాటు చేయడంలో వారికి సహాయం చేశారని మావోయిస్టులు ఆరోపించారు. కడేర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ఆవలం బీజా పూర్‌లోని శాంతినగర్‌లో నివాసం ఉండేవారు.
వ్యవసాయ పనుల నిమిత్తం స్వగ్రామం ఖాదర్ కు వెళ్లారు. అతను తన వ్యక్తిగత పని కోసం ఖాదర్ నుంచి సమీపంలోని కైక గ్రామానికి వెళ్లి.. తిరిగి ఖదర్‌కు వస్తుండగా.. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు సుఖ్‌రామ్‌ను అడవి వైపు తీసుకెళ్లారు. అనంతరం మావోయిస్టులు అతడిని హత్య చేసి, మృతదేహాన్ని కాదర్-కైకా రహదారిపై విసిరారు.
ఘటనా స్థలం నుంచి గంగలూరు ఏరియా కమిటీ మావోయిస్టులు జారీ చేసిన కరపత్రాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి మరో ఘటనలో మాజీ సర్పంచ్ సుకాలు ఫర్సాను మావోయిస్టులు అనుమానితులు కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు అధికారులు తెలిపారు.
బిర్యాభూమి గ్రామానికి వెళ్లే మార్గంలో మావోయిస్టులు ఫర్సాను కిడ్నాప్ చేశారు. ఫర్సా కుమార్తె తన తండ్రిని వదిలిపెట్టమని ఎంతో ప్రాధేయపడిన అయినా నక్సల్స్ కనికరం చూప కుండా ఫర్సాను హత మార్చారు.
పోలీసులు మృత దేహాన్ని, మావోయిస్టుల కరపత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఫర్సా బీజేపీలో చేరినం దుకు చంపేశామని మావోయిస్టులు కరపత్రంలో పేర్కొన్నారు.
కాగా.. ఛత్తీస్‌గఢ్‌లో ఈ సంవత్సరం పోలీసులను నక్సలైట్లు కనీసం 55 మందిని చంపినట్లు పోలీసులు తెలిపారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.