నారద వర్తమాన సమాచారం
స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంటును అవిష్కరించిన సీఎం చంద్రబాబు
విజయవాడ:
స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్‌ను సీఎం చంద్రబాబు ఆవిష్కరిం చారు. పది సూత్రాలు ఒక విజన్ పేరిట డాక్యుమెంట్ రూపొందించారు. జాతికి, రాష్ట్ర ప్రజలకు అంకితమం టూ విజన్ డాక్యుమెంట్‌పై సీఎం చంద్రబాబు సంతకం చేశారు.
సీఎంతో పాటు విజన్ డాక్యుమెంట్‌పై ఉపముఖ్య మంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ సంతకం చేశారు.స్వర్ణాంధ్ర 2047 విజన్‌ను 10 సూత్రాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు. స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ కార్యక్రమంలో వివిధ వర్గాల ప్రజలు తమ అభిప్రాయాలు పంచు కున్నారు.
ఆక్వా ఉత్పత్తుల రవాణా లో ఇబ్బందులు పరిష్కరిం చాలని ఆక్వా రైతులు కోరారు. మహిళా ఆర్థికాభి వృద్ధికి ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటా మని డ్వాక్రా మహిళ సుహాసిని తెలిపారు. 2047 నాటికి ఏపీ దేశంలోనే అగ్రస్థానంలో నిలవాలని ఇంటర్మీడియట్ విద్యార్థిని ఆకాంక్షించారు. విజన్ స్వర్థాంధ్ర 2047పై ప్రభుత్వం ప్రత్యేక వీడియో విడుదల చేసింది.
స్వచ్ఛాంధ్ర అంటే స్వచ్ఛ మైన ఆలోచనలు ఉండాలంటూ స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ కార్యక్రమం స్టాల్స్ వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు ఛలోక్తులు విసిరారు. పరీక్షలకు ఎలా సిద్ధమవు తున్నారంటూ విద్యార్థుల తో సీఎం ముచ్చటించారు. మహిళా రైతులతో ముఖ్య మంత్రి, ఉపముఖ్యమంత్రి ముఖాముఖి మాట్లాడారు.
మహిళా ఆర్థికాభివృద్ధికి అందుతున్న తోడ్పాటుపై నేతలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. విజయవాడ మున్సిపల్ స్టేడియంలో స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఎస్పీలు, హెచ్ఓడీలు తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.