Wednesday, February 5, 2025

పల్నాడు జిల్లా పోలీస్ అధికారులతో నేర సమీక్షా సమావేశం నిర్వహించిన పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాస రావు ఐపిఎస్

నారద వర్తమానం సమాచారం

పల్నాడు జిల్లా పోలీస్ అధికారులతో నేర సమీక్షా సమావేశం నిర్వహించిన పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాస రావు ఐపిఎస్

ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ –
పెండింగ్ కేసులను హేతుబద్దంగా విశ్లేషించి తగ్గించాలని సూచించారు.

పోలీస్ స్టేషన్ లను ఆశ్రయించే బాధితులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి,సున్నితమైన భాషతో మాట్లాడాలని, వారితో మమేకమై సమస్యలను ఓపికగా విని, ఫలితంగా బాధితులకు న్యాయం జరుగుతుందనే నమ్మకం కలిగించాలని పోలీస్ అధికారులకు సూచించారు.

మహిళలు, బాలికలు, చిన్నారుల పిర్యాదులు అందిన వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని, వారికి సంబంధించిన కేసుల విచారణ సమయంలో తప్పనిసరిగా మహిళా పోలీస్ అధికారి గాని, సిబ్బంది గాని ఉండేటట్లుగా చూసుకోవాలని సూచించారు.

“ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమం ద్వారా వచ్చే ఫిర్యాదులను నిర్దిష్ట సమయంలోగా చర్యలు చేపట్టి, పోర్టల్ లో డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాలన్నారు.

పోక్సో కేసులు, మహిళల పై జరిగే నేరాలు, రోడ్డు ప్రమాదాలు, ప్రాపర్టీ కేసులు, మిస్సింగ్ కేసులు మొదలైన కేసుల దర్యాప్తు త్వరితగతిన పూర్తి చేయాలని మరియు సదరు నేరాలు అరికట్టే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేసారు.

జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక దృష్టి సారించి తగు చర్యలు తీసుకోవాలని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కలిగి ఉండే విధంగా అవగాహన సదస్సు ఏర్పాటు చేయాలని, వేగ నియంత్రకాలు ట్రాఫిక్ సూచనలను తెలిపే సైన్ బోర్డులను అవసరమైన చోట STOP BOARDS ను ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేయాలని సూచించారు.

పాత నేరస్తుల కదలికలపై నిఘా ఉంచాలి. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించే వారి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించే వారిపై ప్రతిరోజు రైడ్ లు నిర్వహించాలన్నారు.

బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించే వారిని పూర్తిస్థాయిలో కట్టడి చేస్తే నేరాలు కూడా తగ్గే అవకాశం ఉంటుందన్నారు.

ఈ నేర సమీక్షా సమావేశంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక పిటిషన్లు, POCSO కేసులు, గ్రేవ్ కేసులు, ప్రాపర్టీ కేసులు, చీటింగ్ కేసులు, 174 Cr.PC కేసులు, మిస్సింగ్ కేసులు, , గంజాయి, నాటుసారా ల కట్టడికి తీసుకోవలసిన చర్యల గురించి సమీక్షించారు.

జిల్లా ఎస్పీ అధికారులతో మాట్లాడుతూ 112 ఎమర్జెన్సీ నెంబర్ల నుండి వచ్చు కాల్స్ కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. వాటి పట్ల నిర్లక్ష్యం వహించకుండా వెనువెంటనే స్పందించి సంఘటన స్థలానికి చేరుకుని సమస్యను పరిష్కరించాలన్నారు. కాల్ వచ్చిన సమయం మరియు సంఘటన స్థలానికి చేరుకున్న సమయాన్ని పరిగణలోకి తీసుకొని నిర్లక్ష్యంగా స్పందించిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ  అధికారులను హెచ్చరించారు.

రౌడీలు, సస్పెక్ట్ లు, పాత నేరస్తుల కదలికలపై నిఘా ఉంచాలన్నారు. వారి ప్రవర్తన ఎలా ఉంది, వారు కొత్త వ్యక్తులను ఎవరినైనా కలుస్తున్నారా, ఏదైనా నేరానికి పాల్పడే అవకాశం ఉంటుందా వంటి సమాచారాన్ని సేకరించుకోవాలన్నారు

గంజాయి అక్రమ రవాణా, క్రయ విక్రయాల పై కఠినంగా వ్యవహరించాలన్నారు

జిల్లాలో గాంజాను నిర్మూలించడానికి కొన్ని ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వాటిని అరికట్టే దిశలో ఉన్నట్లు తెలిపారు.

విచారణ దశలో వున్న కేసులను సాంకేతిక పరిజ్ఞాన్ని, వృత్తి నైపుణ్యాన్ని ఉపయోగించి వేగవంతంగా దర్యాప్తుచేసి సంబంధిత కోర్టులో ఛార్జ్ షీట్ వేయాలన్నారు. కోర్టులో ట్రైల్ సక్రమంగా జరిగే విధంగా సంబంధిత డిఎస్పీ, సిఐ, పోలీస్ స్టేషన్ ఎస్.హెచ్.ఓ లు స్వయంగా పర్యవేక్షించుకోవాలన్నారు.
సాక్షులు సరైన రీతిలో నిర్భయంగా న్యాయమూర్తి ఎదుట సాక్ష్యం చెప్పేవిధంగా తర్ఫీదు ఇవ్వాలన్నారు. నిందితుడికి కోర్టు శిక్ష విధించినప్పుడే మనం బాధితులకు సరైన న్యాయం చేసినట్లు అవుతుందన్నారు.

ఈ సమావేశంలో ఎస్పీ తో పాటు అదనపు ఎస్పి అడ్మిన్ జె.వి.సంతోష్ CCS అడిషనల్ ఎస్పీ లక్ష్మీపతి ,AR అడిషనల్ ఎస్పీ V.సత్తి రాజు నరసరావుపేట
డిఎస్పి K. నాగేశ్వరరావు , సత్తెనపల్లి డిఎస్పి
M.హనుమంతరావు  గురజాల డిఎస్పీ జగదీష్ SB – 1 సిఐ B.సురేష్ బాబు SB – 2 సిఐ P.శరత్ బాబు ,RI లు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version