నారద వర్తమాన సమాచారం
పల్నాడు జిల్లా ప్రజలందరూ నూతన సంవత్సర వేడుకలను ఆనందోత్సాహాలతో జరుపుకుంటూ, ది.31-12-2024 వ తేది రాత్రి సమయములో ఈ క్రింది తెలిపిన నిభందనల ను పాటించి పోలీస్ వారికి సహకరించవలసినదిగా పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాస రావు ఐపీఎస్ విజ్ఞప్తి చేయటమైనది.
1.నూతన సంవత్సర వేడుకలు మరియు సాంస్కృతిక కార్యక్రమ నిర్వాహకులు లౌడ్ స్పీకర్లు/మ్యూజిక్, సిస్టంలు ఉపయోగించుట కొరకు తప్పనిసరిగా సంబధిత పోలీస్ అధికారి నుంచి ముందస్తు అనుమతి పొందవలెను.
2 . న్యూస్ పేపర్లు, మాగజైన్స్, హోర్డింగ్స్ లలో అశ్లీలత కల్గిన పోస్టర్లు గాని, ప్రకటనలు గాని, వేడుకలకు సంభందించి చేయరాదు.
3.వేడుకలలో అశ్లీల నృత్యాలు, చర్యలు, అశ్లీల సంజ్ఞలు ఆనుమతించబడవు.
4 . మద్యమునకు సంబంధించి సంబధిత అధికారులు అనగా అబ్కారి శాఖ వారి నుండి లైసెన్స్ లేఖ అనమతి లేనిదే లిక్కరు అమ్ముట నిషిద్ధం.
5.వేడుక కార్యక్రమాలు నిర్వహించే వారు సరియైన లైటింగ్ సదుపాయం, కూర్చొనే సదుపాయం, టాయిలెట్ సదుపాయం కల్పించవలేను.
6 .వేడుక కార్యక్రమాలు నిర్వహించే వారు ప్రజలకు ప్రమాదం కలిగించేటటువంటి కార్యక్రమములు, విన్యాసములు నిషిద్ధం. ప్రేలుడు పదార్దములు, ఫైర్ అర్మ్స్ ఉపయోగించుట పూర్తిగా నిషిద్దం.
7.ప్రజలు పబ్లిక్ ప్రదేశాలలో లిక్కర్ సేవించుట మరియు పేకాట ఆడుట నిషిద్దం.
8 .వేడుక కార్యక్రమాలు నిర్వహించే వారు మ్యూజిక్ సిస్టమ్ రాత్రి 10 గం.,ల తరువాత వాడరాదు (సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం).
- మద్యం త్రాగి వాహనములు నడిపే వారిపై, మితిమీరిన వేగంతో వాహనాలు నడిపే వారిపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించబడును. ఇందుకు గాను అన్ని కూడళ్ళ లో అల్కో మీటర్లు ఉపయోగించి మద్యము త్రాగి వాహనములు నడిపిన వారిని తనిఖీ చేయడం జరుగుతుంది. అటువంటి సంఘటనల్లో మద్యము త్రాగి డ్రైవ్ చేసినవారి వాహనాన్ని సీజ్ చేసి రికార్డులు స్వాదీనం చేసుకొని నిందుతులను సంబధిత కోర్టులలో హాజరు పెట్టుదురు. అట్టివారికి MV Act ప్రకారం రూ.10,000/- లు జరిమానా లేక 6 నెలల వరకు కారాగార శిక్ష లేదా రెండు విదించబడును మరియు త్రాగి వాహనం నడిపి శిక్ష పడిన వాహానదారుని యొక్క లైసెన్స్ రద్దు చేయుటకు గాను సెక్షన్ 20 M.V. Act ప్రకారం సిఫారసు చేయబడును.
10.కూడళ్ళలో ఏర్పాటు చేసిన సి.సి. కెమేరాలు ద్వారా రికార్డింగ్ చేసి, పోలిస్ కమాండ్ కంట్రోల్ ద్వారా పర్యవేక్షించ బడును.
11.ఆకతాయిలు మితిమీరి ప్రవర్తించే యువతను, రోడ్ లపై చిందులు తొక్కే మందుబాబులను, ఇష్టానుసారంగా వాహనాలను నడిపే వారిని చిత్రీకరించేందుకు వీడియో కెమేరాలు మరియు డిజిటల్ కెమేరాలు ఉపయోగిస్తున్నాము.
12 .వాహనాలను అతి వేగంగా నడపడం, సైలెన్సర్ లు తీసి వాహనాన్ని నడపడం, హారన్ అదే పనిగా మ్రోగించడం, రాంగ్ రూట్లలో డ్రైవ్ చేయడం, వాహనం పై విన్యాసాలు చేయడం, జిగ్ జాగ్ గా డ్రైవ్ చేయడం, స్నేక్ డ్రైవింగ్ ప్రమాదకరము గా వాహనములు నడపటం, ద్విచక్ర వాహనాల పై ముగ్గురు ప్రయాణించడము లాంటి చర్యలను నిరోదించడానికి ప్రత్యేక బలగాలను రంగంలోకి దింపి వారిపై చర్యలు తీసుకొబడును.
- ప్రభుత్వ అనుమతి పొందిన బార్లు, క్లబ్ లు ఇతర హోటల్ లలో నిర్ణీత సమయం దాటి తెరచి వుంచితే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
14 .సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే నిర్వాహకులు నిబంధనల ప్రకారం సరియైన సమయానికి కార్యక్రమాలు ముగించాలి. వాహనాలను సక్రమంగా పార్కింగ్ చేయుటకు గాను స్థలమును కేటాయించి అదనపు సెక్యూరిటీ సిబ్బందిని వాడవలెను. వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలిగించరాదు.
- వాహనాము లను అనుమతి లేనిచోట పార్కింగ్ చేయరాదు. అట్లు చేసిన యెడల అట్టి వాహనము లను టోయింగ్ వాహనాల ద్వారా తొలగించబడును.
16 .అన్ని ప్రాంతలలో పోలిస్ చెక్ పోస్ట్స్ ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించబడును.
- మహిళలు ఒంటరిగా, జనావాసాలు లేని ప్రదేశాలకు వెళ్ళవద్దు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.