నారద వర్తమాన సమాచారం
వార్షికోత్సవం వేడుకల్లో పాల్గొన్న –
ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు,
ఎమ్మెల్యే అరవింద్ బాబు
పల్నాడు జిల్లా నరసరావుపేట ఐగ్రో అంతర్జాతీయ పాఠశాల ఎనిమిదవ వార్షికోత్సవం వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి వేల్పుల సింహాద్రి యాదవ్, బిజెపి నాయకులు రంగిశెట్టి రామకృష్ణ, పాఠశాల చైర్మన్ పల్లబోతుల వెంకట్, వైస్ చైర్మన్ పల్లబోతుల మురళి బాబు లు హాజరయ్యారు. ముందుగా పాఠశాల చైర్మన్, వైస్ చైర్మన్ లు జ్యోతి ప్రజ్వలన చేసి
విద్యార్థిని, విద్యార్థులచే వేడుకలను ప్రారంభించారు. అనంతరం ముఖ్య అతిథిగా విచ్చేసిన నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ విద్యార్థిని, విద్యార్థులకు చదువుతోపాటు,క్రీడ పోటీల్లో, సంస్కృతిక పోటీల్లో, పాల్గొనడం వలన శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంటారని, గెలిచిన వారు గర్వపడరాదని, ఓడిన వారు నిరుత్సాహ పడరాదని,గెలుపు ఓటమిలను సమానంగా స్వీకరించాలని, విద్యార్థులు జాతీయ నాయకులను ఆదర్శంగా తీసుకొని, అన్ని రంగాల్లో రాణించి తల్లిదండ్రులకు, గురువులకు, పాఠశాలకు,ఊరికి మంచి పేరు తీసుకురావాలనీ,పిల్లల విషయంలో ఎప్పటికప్పుడు గమనిస్తూ, వారికి గదులకే అంకితం చేయకుండా, విశాలమైన ఆట స్థలాల్లో స్వేచ్ఛగా ఆడుకునే విధంగా ప్రోత్సహించాలని, కుటుంబ సభ్యులు, గురువులు, పాఠశాల యజమాన్యం ప్రత్యేక పర్యవేక్షణ చేస్తూ అవసరం మెరుకు సమాచారం తల్లిదండ్రులకు తెలియజేయాలన్నారు.శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు మాట్లాడుతూ నరసరావుపేటలో ఇలాంటి విశాలవంతమైన పాఠశాల ఉండటం హర్షించదగ్గ విషయమని, విద్యార్థులు బాగా కష్టపడి చదువుకొని డాక్టర్లుగా, ఇంజనీర్లుగా ఉన్నతమైన స్థానాల్లో ఉండాలని, ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని, ప్రకృతిని కాపాడుకోవాలని, 8వ వార్షికోత్సవం వేడుకల్లో నన్ను ఆహ్వానించిన పాఠశాల యజమాన్యం వారికి కృతజ్ఞతలు తెలిపారు. పాఠశాల చైర్మన్ పల్లబోతుల వెంకట్ మాట్లాడుతూ
ఎనిమిది సంవత్సరాలుగా తమ పాఠశాలను ఆదరిస్తున్న, విద్యార్థిని, విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు అభినందనలు తెలియజేశారు. అదేవిధంగా పల్నాడు జిల్లా ముఖద్వారం నరసరావుపేటలో తమ పాఠశాల స్థాపించి ఎనిమిదవ వార్షికోత్సవం వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉన్నారు. వైస్ చైర్మన్ పల్లబోతుల మురళి బాబు మాట్లాడుతూ వివిధ క్రీడాంశాల్లో గానీ, ఆయా సంస్కృతిక పోటీల్లో గాని, తమ పాఠశాల విద్యార్థులకు అన్ని రంగాల్లో బహుమతులు రావడం, వారిని తీర్చి దిద్దిన విద్యార్థుల తల్లిదండ్రులకు టీచర్లకు అభినందన తెలియజేశారు, ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ దివి శేష సాయి, వైస్ ప్రిన్సిపాల్ ఎండ్లూరి చంద్రబాబు, వేల్పుల సత్యనారాయణ, డాక్టర్ కోడెల శివప్రసాదరావు స్టేడియం డెవలప్మెంట్ సొసైటీ అడ్వైజర్ మరియు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఇంచార్జ్ మాజీ సభ్యులు ఎస్.కె. జిలాని మాలిక్, మ్యూజిక్ టీచర్ మౌలాలి, యాక్టివిటీ కోఆర్డినేటర్ మాధవి టీచర్, డాన్స్ టీచర్ సుహాసిని, జానీ, పాఠశాల అడ్మినిస్ట్రేషన్ సిబ్బంది సాయిబాబా, విశ్వనాధ్, సాయి, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, విద్యార్థినీ, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మరియు నాన్ టీచింగ్ సిబ్బంది మరియు షేక్ ఖాసిం, భాష,హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.