నారద వర్తమాన సమాచారం
మహిళల సాధికారిత బలోపేతానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది : జిల్లా ఇన్చార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్
పల్నాడు జిల్లా, నరసరావుపేట
రాష్ట్రంలో మహిళా సాధికారతకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్చార్జి మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పేర్కొన్నారు.
స్థానిక కలెక్టరేట్ లోని గుర్రం జాషువా సమావేశ మందిరంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమానికి పల్నాడు జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు అధ్యక్షత వహించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలకు రాష్ట్ర మంత్రితో పాటు జిల్లా పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయులు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, మాజీ మంత్రి వర్యులు, చిలకలూరి పేట నియోజక వర్గ శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు, నరసరావుపేట శాసన సభ్యులు చదలవాడ అరవింద్ బాబు, మాచర్ల నియోజక వర్గం శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మానంద రెడ్డి లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మహిళా మణులు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. 115 సంవత్సరాల కిందట డెన్మార్క్ రాజధానిలో మార్చి 8న మొదటిసారి మహిళా దినోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయన్నారు. పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాలలో వృద్ధి సాధించడం మంచి పరిణామమన్నారు.
బాల్యవి వాహాలు, మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు లాంటి ఎన్నిటినో జయిస్తూ ముందుకు సాగుతున్నామన్నారు.
దేశం కంటే ముందే ఆలోచించే వ్యక్తి, దార్శనికుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని మంత్రి వ్యాఖ్యానించారు. మహిళల సాధికారం కోసం స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేశారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకు వచ్చిన ఐటీ విప్లవం తో మహిళలు పురుషోత్తం సమానంగా సంపాదిస్తున్నారన్నారు.
అంబేద్కర్ రాజ్యాంగంలో మహిళలు గౌరవంగా జీవించే హక్కు కల్పించారన్నారు. ఎన్టీఆర్ ఆస్తిలో సమాన హక్కుల తో పాటు రాజకీయం గా పురుషుల తో పాటు సమాన హక్కులు కల్పించా రన్నారు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం అన్నారు.
ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు మాట్లాడుతూ ఆడది అంటే భూదేవి కున్నంత సహనం ఉందని, ఆడది లేకుండా సమాజం మనుగడ కూడా కష్టమేనని మన రాష్ట్ర ముఖ్యమంత్రి ముందే ఊహించి మహిళల కు సమాజంలో సంచిత స్థానం కల్పించా రని అందువల్లే ఎక్కువగా రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలు అన్నిటిని ఆడపిల్లల పేరున అందిస్తున్నారని.. అందరిని ఆర్థికంగా పైకి తీసుకు వచ్చేందుకు సీఎం కృషి చేస్తున్నారని కొనియాడారు.
మాచర్ల ఎమ్మెల్యే జూల కంటి బ్రహ్మానంద రెడ్డి మాట్లాడు తూ రాణులు, మహా రాణులు అయిన ఆటువంటి మహిళ లందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తల్లి, తండ్రి, గురువు దైవం అంటుంటాం.తల్లికి మొదటి స్థానం ఇచ్చామని, భారతీయ సమాజం పాటించిన సంస్కృతి, సాంప్రదా యాలను ప్రపంచం మొత్తం పాటిస్తుందనడానికి ఇదొక నిదర్శనమన్నారు. మహిళ తొలి.. తల్లిగా.. ఆ తరువాత టీచరుగా.. ఇంటికి ఇల్లాలుగా.. కుటుంబానికి సంరక్షణగా ఎంతో బాధ్యతను నిర్వర్తించడమే కాకుండా, సమాజ ప్రగతిలోనూ గణనీయమైన పాత్రను పోషిస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో 603 స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ నిమిత్తం రూ.125.87 కోట్ల రూపాయల చెక్కును మంత్రి లబ్దిదారులకు అందజేశారు. మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న మహిళలకు బహుమతులు అందజేశారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.