నారద వర్తమాన సమాచారం
విశాఖ ఉక్కుకు 11,440 కోట్ల ప్యాకేజీ ప్రకటించిన కేంద్రం
విశాఖ ఉక్కుకు రూ.11,440 కోట్ల ప్యాకేజీని కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ శుక్రవారం అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ ప్యాకేజీకి గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం ఆమోదముద్ర వేసినట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
దీనిపై ప్రధాని కామెంట్స్
▪️విశాఖ ఉక్కుకు ఆంధ్రుల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉంది.
▪️రూ.10వేల కోట్లు అందించాలని గురువారం కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నాం.
▪️విశాఖ ఉక్కు పరిశ్రమకు ఈక్విటీ మద్దతును అందించాలని నిర్ణయించాం.
▪️ఆత్మ నిర్భర్ భారత్లో భాగంగా ఈ సాయం అందిస్తున్నాం.
ఆర్థిక ప్యాకేజీ తక్షణం అమల్లోకి..
ఇది భారీ రివైవల్ ప్యాకేజీ. స్టీల్ రంగంలో విశాఖ ఉక్కు ప్రధానమైన సంస్థ. విశాఖ ఉక్కు.. పోర్టు ఆధారిత స్టీల్ ప్లాంట్. ఈ పరిశ్రమను ఏళ్ల తరబడి సమస్యలు వేధిస్తున్నాయి. విశాఖ ఉక్కుకు ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ తక్షణం అమల్లోకి వస్తుంది. త్వరలో రెండు బ్లాస్ట్ ఫర్నేస్లు ప్రారంభమవుతాయి ఆగస్టు నాటికి 3 బ్లాస్ట్ ఫర్నేస్లు అందుబాటులోకి వస్తాయి. ముడి సరకు సరఫరా కోసం ఎన్ఎండీసీతో చర్చిస్తున్నాం. దేశ ఉక్కు అవసరాలు తీర్చడంలో విశాఖ స్టీల్ ప్లాంట్ కీలక పాత్ర. స్టీల్ ప్లాంట్ యాజమాన్యం, కార్మికులకు శుభాకాంక్షలు” అని అశ్వినీవైష్ణవ్ తెలిపారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.