నారద వర్తమాన సమాచారం
ఏపీ హైకోర్టుకు ఇద్దరు కొత్త జడ్జిల నియామకం
ఏపీ హైకోర్టు అడిషనల్ జడ్జిలుగా హరిహరనాథ శర్మ, లక్ష్మణరావు
రాష్ట్రపతి ఉత్వర్వులు
నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ
ఏపీ హైకోర్టుకు కొత్తగా ఇద్దరు అడిషనల్ జడ్జిలను నియమించారు. ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా అవధానం హరిహరనాథ శర్మ, డాక్టర్ యడవల్లి లక్ష్మణరావులను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు ఇచ్చారు. ఈ మేరకు కేంద్ర లా అండ్ జస్టిస్ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.
అవధానం హరిహరనాథ శర్మ, యడవల్లి లక్ష్మణరావు ఏపీ హైకోర్టు అడిషనల్ జడ్జిలుగా రెండేళ్ల పాటు కొనసాగుతారు. వీరిద్దరినీ అదనపు జడ్జిలుగా నియమించాలన్న ప్రతిపాదనకు జనవరి 11న జరిగిన సమావేశంలో సుప్రీంకోర్టు కొలీజయం ఆమోదం తెలిపింది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.