నారద వర్తమాన సమాచారం
పిడుగురాళ్ల పట్టణంలో ఘనంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ 128 వ జయంతి వేడుకలు
పిడుగురాళ్ల :
పిడుగురాళ్ల పట్టణంలోని మున్సిపల్ ఆఫీస్ నందు కమిషనర్ పర్వతనేని శ్రీధర్ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్వాతంత్య్ర పోరాటంలో బ్రిటిష్ వారిని గడగడలాడించడమే కాక దేశ ప్రజల మధ్య పరస్పర నమ్మకాన్ని, ఐక్యతను పెంపొందించిన గొప్ప జాతీయ నాయకుడని తొలుత సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నేతాజీ గొప్ప దేశభక్తుడని, ఆయన ఆధ్వర్యంలో బ్రిటీష్ వారిని ఎదిరించడానికి ఆజాద్ హింద్ ఫౌజ్ అనే సైన్యాన్ని తయారుచేసి బ్రిటీష్ పాలకులను గడగడ లాడించారన్నారు. నేతాజీ జైహింద్ నినాదంతో భారతీయులను ఉత్తేజితులను చేశారని అన్నారు . అలాగే ప్రతి ఒక్కరు దేశభక్తి కలిగి ఉండాలని అన్నారు
ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ మరియు మున్సిపల్ మరియు సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.