నారద వర్తమానం సమాచారం
నిర్వసితులకు న్యాయం జరగకుంటే పోరాటమే..నిర్వసితుల పతాక యాత్ర సభలో మాజీ పార్లమెంట్ సభ్యులు మధు..
కూనవరం, వి. ఆర్ పురం, చింతూరు
సీపీఎం పార్టీ 27 వ మహాసభల సందర్బంగా సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో పోలవరం నిర్వసితుల పతాక యాత్ర ప్రారంభించారు సీపీఎం నాయకులు.ఈ కార్యక్రమాన్ని మాజీ పార్లమెంట్ సభ్యులు మధు మండలంలోని బొజ్జరాయిగూడెం లో ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ యాత్ర బైక్ ర్యాలీ తో కొనసాగుతూ కూనవరం మండలంలో ప్రారంభమై చింతూరు, వి. ఆర్ పురం, మళ్ళీ కూనవరం చేరుకొని ఎటపాక చేరుకొని వచ్చే నెల 1,2,3 తారీఖులలో జరగనున్న నెల్లూరు మహా సభకు చేరుకుంటుందని తెలియ జేశారు. ఈ సందర్బంగా బొజ్జరాయి గూడెంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలవరం. పేరుతో ఈ ప్రాంత ప్రజలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గోదావరి ముంచుతున్నాయని అన్నారు.ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ నిర్వసితులకు పరిహారం ఇవ్వడంలో విఫలం అవుతున్నాయని అన్నారు. అభివృద్ధి చెందిన దేశాలలో నిర్వసితులకు అన్ని సౌకర్యాలు కల్పించిన తర్వాతే ప్రాజెక్ట్ కడతారని కాని మన పోలవరం విషయం లో ఇది భిన్నంగా ఉందని అన్నారు.ఎకరాకు 1.15వేల రూపాయలు ఇచ్చి ప్రభుత్వాలు చేయి దులుపుకున్నాయని అన్నారు.ఇచ్చిన ప్రతి భూమికి 50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసారు.పునరావాసం కల్పించడంలో ఈ ప్రభుత్వాలు సరైన నిర్ణయాలు తీసుకోక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన పునరావాస కాలనీ లు మళ్ళీ వరదలకు మునుగుతున్నాయని ఎద్దేవా చేసారు. లేడార్ సర్వే పేరుతో ముంపు ప్రాంత ప్రజలను ఇబ్బంది పెడుతూ ఏటా ముంచుతున్నారని అన్నారు.ఈ ప్రభుత్వాలు ఈ ప్రాంత ప్రజలను న్యాయం చేయకుండా మోసం చేస్తూ కాలయాపన చేస్తుందని అన్నారు.టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీ పార్ట్టీకి తొత్తు గ వ్యవహారిస్తూ గిరిజన మనుగడకు ప్రమాదం తెస్తున్నాయని హెచ్చరించారు. అనంతరం సీపీఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు దడాల సుబ్బారావు మాట్లాడుతూ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టినప్పటి నుండి ప్రభుత్వాలు మారుతున్నాయి గాని పునరావాసం ప్యాకేజీ ఇవ్వడం ప్రభుత్వాల పనికి తీరు దారుణమని అన్నారు. ఆనాటి నుండి పోలవరం ప్రాజెక్ట్ వద్దని చెప్పింది సీపీఎం పార్టీ అని గుర్తు చేసారు.ఎన్ని ప్రభుత్వాలకు నిర్వసితుల సమస్యల గురించి చెప్పినా దున్నపోతు మీద వాన అన్న చందంగా ఉందని అన్నారు.కాంట్రాక్టర్ల దగ్గర డబ్బులు దండుకోవడం తప్ప ప్రజలకు న్యాయం జరగడం లేదని అన్నారు.ముంపుకి గురయ్యే ప్రతిరైతుకి 1కి 4 రెట్లు ఇవ్వాలని డిమాండ్ చేసారు.అనంతరం జిల్లా కార్యదర్శి బొప్పెన కిరణ్ మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలకు పోలవరం సమస్య అతి పెద్ద సమస్య అని వర్ణించారు. ప్రతి ఏటా మునుగుతూ ఆర్ధికంగా దెబ్బ తింటుంటే ప్రభుత్వాలు ముంపుకి గురైన గ్రామాలకు పప్పు ఉల్లిపాయలు ఇస్తూ కాలయాపన చేస్తుందని అన్నారు.సర్వేల పేరుతో ముంపు వాసులను మోసం చేస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా సరైన సర్వేలు జరిపి త్వరిత గతిన ప్యాకేజీ ఇప్పించాలని డిమాండ్ చేసారు.ఈ కార్యక్రమం లో కార్యదర్శి వర్గ సభ్యులు లోతా రామారావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మర్లపాటి నాగేశ్వరావు, సున్నం రాజులు, వి. ఆర్ పురం ఎంపీపీ కారం లక్ష్మి, జిల్లా కమిటీ సభ్యులు సీసం సురేష్, మడకం నాగమణి, పులి సంతోష్, మేకల నాగేశ్వరావు మండల కార్యదర్శి బాబు బొర్రయ్య, వైస్ ఎంపీపీ కొమరం పెంటయ్య, చింతూరు మండల కార్యదర్శి పల్లపు వెంకట్,యర్రం శెట్టి శ్రీనివాసరావు మరియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.