నారద వర్తమాన సమాచారం
యర్రబాలెంలో విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్*
ఘనస్వాగతం పలికిన కూటమి నేతలు, స్థానికులు
అమరావతిః
మంగళగిరి నియోజకవర్గం యర్రబాలెంలో శ్రీ ముత్యాలమ్మ తల్లి, శ్రీ పోతురాజు స్వామి వార్ల విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ముందుగా ఆలయానికి చేరుకున్న మంత్రి నారా లోకేష్ కు కుటమి నేతలు, స్థానిక ప్రజానీకం ఘనస్వాగతం పలికారు. పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఆలయంలోకి ప్రవేశించారు. అనంతరం నిర్వహించిన శ్రీ ముత్యాలమ్మ తల్లి, శ్రీ పోతురాజు స్వామి వార్ల విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జై ముత్యాలమ్మ తల్లి, జై పోతురాజు స్వామి నామస్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. మంత్రి నారా లోకేష్ రాకను పురస్కరించుకుని వేది పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆయనకు ఆశీర్వచనాలు అందించారు. విగ్రహ ప్రతిష్ట మహోత్సవం అనంతరం మంత్రి నారా లోకేష్ ముత్యాలమ్మ తల్లి, పోతురాజు స్వామి వార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం స్థానికులతో కలిసి ఫోటోలు దిగారు. నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలీ వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ నందం అబద్దయ్య, ఏపీఎమ్ఎస్ఐడీసీ ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, గుంటూరు పార్లమెంట్ టీడీపీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, రాష్ట్ర తెలుగుమహిళ ప్రధాన కార్యదర్శి ఆకుల జయసత్య, గ్రామ మాజీ సర్పంచ్ భీమవరపు శ్రీనివాసరావు, యర్రబాలెం ముత్యాలమ్మ తల్లి ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు..
Discover more from
Subscribe to get the latest posts sent to your email.