నారద వర్తమాన సమాచారం
వ్యవసాయ ,ఉద్యానవన , వెలుగు , అనుబంధ శాఖల అధికారులందరూ ప్రకృతి వ్యవసాయంలో భాగస్వామ్యలు కావాలి! పల్నాడు జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు
ది 21 .2 .25 శుక్రవారం పల్నాడు జిల్లా కలెక్టరేట్ లో ప్రకృతి వ్యవసాయ కార్యాచరణ ప్రణాళిక పై జిల్లా స్థాయి సమన్వయ సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా పల్నాడు జిల్లా క కలెక్టర్ పి.అరుణ్ బాబు (ఐ ఏ ఏస్) వారు పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత కాల పరిస్థితులు ప్రకారం రైతులు రసాయనిక పురుగు మందులు అధికంగా వాడటం వల్ల రైతులకు పెట్టుబడి పెరిగి, ఆదాయం తగ్గటంతో భూమి భూసారం కోల్పోయి, పంటల దిగుబడి తగ్గుతుందని, అదేవిధంగా ప్రకృతి పర్యావరణానికి హాని కలిగి పండించిన పంటలు లో పురుగుమందుల అవశేషాలు ఉండటం వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని.
దీనికి ప్రత్యామ్నాయంగా ప్రకృతి వ్యవసాయం చేయవలసిన ఆవశ్యకత ఉందని తెలియజేశారు.
ప్రకృతి వ్యవసాయంలో( పీ ఎం డి ఎస్) అనగా ప్రధాన పంటకు ముందుగా వేసవిలో ఫ్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ 30 రకాల విత్తనాలను రైతులందరూ వేసుకునే విధంగా అన్ని శాఖల అధికారులు ప్రోత్సహించాలన్నారు.
వెలుగు శాఖ జిల్లా సమాఖ్య మండల సమాఖ్య గ్రామ సమాఖ్య సంఘ సమావేశాల్లో ప్రకృతి వ్యవసాయాన్ని ఒక ఎజెండాగా చేర్పించి విరివిగా చర్చించి ప్రకృతి వ్యవసాయానికి అవసరమైన ఇన్పుట్స్ సంబంధించిన ఎన్ పి ఎం షాపులకు లోన్లు మంజూరు చేయాలని సూచించారు.
ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ఏర్పాటుచేసిన ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల స్టాల్ ను సందర్శించి ప్రతి సోమవారం అన్ని మండలాల్లో ఏవిధంగా స్టాక్స్ ఏర్పాటు చేయటం శుభ పరిణామం అన్నారు.
జిల్లా వ్యవసాయ అధికారి మురళి మాట్లాడుతూ రైతులు విచక్షణారహితంగా ఎరువులు పురుగుమందులు అధిక మొత్తంలో వాడటం వల్ల ఎక్కువగా నష్టపోతున్నారని.
పెట్టుబడి ఎక్కువవుతుంది ఇటు దిగుబడి తగ్గుతుంది భూసారం తగ్గిపోతుంది కావున ప్రత్యామ్నాయంగా ప్రకృతి వ్యవసాయంలో ఉన్నటువంటి పీఎండీఎస్ విత్తనాలు వేసుకోవడం ఘన, ద్రవ జీవామృతం వాడటం పురుగుమందుల కు బదులు వృక్ష సంబంధిత కషాయాలు నీమాస్త్రం, దశపర్ని కషాయం వంటివి వాడుకోవాలన్నారు.
మండల స్థాయి గ్రామస్థాయిలో జరిగే ప్రకృతి వ్యవసాయ కార్యాచరణ ప్రణాళిక లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలన్నారు.
ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు, వాటి విస్తీర్ణం పెరిగేలా చర్యలు చేపడతారని అన్నారు.
ప్రకృతి వ్యవసాయ జిల్లా యాంకర్ కె. రామచంద్రం మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయంలో తొమ్మిది సార్వత్రిక సూత్రాలు గురించి తెలియజేశారు.
ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ కె . అమల కుమారి మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయంలో వివిధ రకాల ఏ గ్రేడ్ మోడల్స్, ఏటీఎం నిరంతరమాదాయాన్ని చ్చే మోడల్స్ , వర్షాభావ పరిస్థితులను తట్టుకునే డౌట్ ప్రూఫ్ మోడల్స్, వేసుకోవడం వల్ల రైతులకు లాభాదాయకమన్నారు. అదేవిధంగా నిరుపేదలైన పిఓపి సభ్యులందరూ కిచెన్ గార్డెన్లో, 365 రోజులు ఉండే విధంగా చూడాలని అన్నారు.
రానున్న ఖరీఫ్ సీజన్ కోసం రైతు వారీగా కార్యాచరణ ప్రణాళికను ను తయారు విధానం, మరియు అమలు చేయడంలో మూడు పేజీల్లో మూడు విడతలుగా జరుగుతుందన్నారు.
ముందుగా జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ వారి ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ ,ఉద్యానవన శాఖ , వెలుగు మొదలైన శాఖల అధికారులతో ప్రకృతి వ్యవసాయంపై సమీక్ష సమావేశం మరియు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
రెండో విడతగా మండల స్థాయిలో ఈ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలియజేశారు.
మూడవదిగా గ్రామస్థాయిలో ప్రకృతి వ్యవసాయ కార్యాచరణ పై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి ర్యాలీలు నిర్వహించి ప్రకృతి వ్యవసాయం మోడల్స్ ప్రదర్శన క్షేత్రాల్లో వేయించి రైతులుకి అర్థమయ్యే విధానంలో తెలియజేస్తారని చెప్పారు.
గ్రామాల్లో ప్రతి ఇంటి వద్ద టెర్రస్ గార్డెనింగ్ మరియు పెరటి తోటలో పెంపకం చేపట్టాలన్నారు.
రైతులు ఏక పంట విధానంతో కాకుండా, బహుళ పంట విధానాలను అవలంబించేలా చూడాలన్నారు.
జిల్లా ఉద్యానవన అధికారి మట్ల్డుతు రైతు సేవా కేంద్రాల ద్వారా వి.ఏ.ఏ మరియు వి హెచ్ ఎ లను ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ మరియు ప్రకృతి వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు పూర్తి సహాయాన్ని అందించామన్నారు.
గత ఐదు సంవత్సరాల నుంచి వరుసగా పిఎండిఎస్ విత్తనాలు వేసి పూర్తిగా ప్రకృతి వ్యవసాయ విధానాల అవలంబిస్తున్న పెదకూరపాడు రైతు దర్శి శేషారావును, నకరికల్లు రైతు రుసుం సాంబశివరావును సన్మానించారు. ఈ సందర్భంగా రైతులు వారు అనుభవాలను తెలియజేస్తూ ప్రకృతి వ్యవసాయం చేయటం వల్ల అతి తక్కువ ఖర్చుతో నాణ్య మైన ఉత్పత్తుల సాధించవచ్చు అన్నారు.
ఆరోగ్యవంతమైన ఆహార పదార్థాలు పండించి ఆహారంగా వినియోగించుకోవడం మరియు మార్కెటింగ్ చేయటం చాలా సంతృప్తికరమ ని వ్యక్తం చేశారు.
ప్రకృతి వ్యవసాయ విధానాల అవలంభించినప్పుడు ప్రకృతి వైపరీత్యాలను సైతం పంటలకు తట్టుకునే శక్తిని పొందుకుంటాయన్నారు. రసాయనక ఎరువులు,
పురుగు మందులపై పెట్టుబడి తగ్గుతుందని తెలియజేశారు.
ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ చేసే గ్రామాల్లో ముందుగా ప్రకృతి వ్యవసాయ, అనుబంధ శాఖలు, గ్రామ సర్పంచి అందరూ కలిసి ర్యాలీలు నిర్వహించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సమాఖ్య ప్రెసిడెంట్ రజిని, జిల్లా స్థాయి అధికారులు, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది , సెరికల్చర్ అధికారులు, ఉద్యాన శాఖ అధికారులు తదిత రులు పల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.