నారద వర్తమానం సమాచారం
కడప జిల్లా :
శ్రీలంకమల అటవీ ప్రాంతంలో 12 శాసనాల నకళ్ళు తయారీ….!
శ్రీలంకమల అటవీ ప్రాంతంలో భారత పురావస్తు సర్వేక్షణ బృందం గురువారం 12 శాసనాల నకళ్ళు తయారు చేసింది.
భారతీయ పురావస్తు శాఖ డైరెక్టర్ డాక్టర్ కానిపాడు మునిరత్నం రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ మా బృందం రిజర్వుడు అటవీ ప్రాంతంలో పర్యటించటం ఇది మొదటిసారి అని తెలిపారు.
క్రీస్తు శకం నాలుగో శతాబ్దo నుంచి 8వ శతాబ్దం వరకు ఉన్న ఈ శాసనాలను ఇటీవల శ్రీలంకమల అభయారణ్యం అటవీ శాఖ అధికారి బి.కళావతి కనుగొన్నారన్నారు. ఆమె ఈ విషయాలను భారత పురావస్తు దృష్టికి తీసుకెళ్లగా మా బృందం బృందo పర్యటించిందన్నారు .
ఈ పర్యటనలో భాగంగా కళావతి కనుక్కున్న శాసనాలను మా బృందం పరిశీలించి వాటి నక్కలను తయారు చేసి భద్రపరి పరిచేందుకు సిద్ధం చేసుకున్నామని చెప్పారు.
ఈ శాసనాలు దక్షిణ భారత దేశ చరిత్ర, సంస్కృతి, పాలన, భాష ను అర్థం చేసుకోవడానికి ఎంతో సహకరిస్తాయని వివరించారు.
యంగ్ ఫారెస్ట్ అధికారి కళావతి కృషి శ్లాగనీయమైనదని ఆయన కొనియాదారు.
ఇలాంటి పర్యటనలు భవిష్యత్తు పురావస్తు పరిశోధనలకు ప్రేరణ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు..
ఈ బృంద పర్యటనకు అనుమతినిచ్చిన ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కు మునిరత్నం రెడ్డి అభినందనలు తెలిపారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.