నారద వర్తమాన సమాచారం
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ స్కూళ్ళ లో మహిళ విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించిన పల్నాడు జిల్లా పోలీసు వారు
అంతర్జాతీయ మహిళా దినోత్సవం (ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే) వారోత్సవాలు – 2025 పురస్కరించుకొని పల్నాడు జిల్లా ఎస్పీ కంచి.శ్రీనివాస రావు ఐ.పి.ఎస్., ఆదేశాల మేరకు జిల్లాలోని వివిధ స్కూళ్లలో మహిళా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించిన జిల్లా పోలీసు వారు.
ఈ సందర్భంగా జిల్లా పోలీస్ అధికారులు మహిళల భద్రత ,హక్కులు సాధికారత, మహిళా చట్టాలు, ఫోక్సో యాక్ట్, ర్యాగింగ్, ఈవ్ టీజింగ్, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ వంటి విషయాలపై వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
అనంతరం విద్యార్థులకు మహిళా దినోత్సవ ప్రాముఖ్యతను వివరించి, సమాజంలో మహిళల పాత్ర, రక్షణ, హక్కుల గురించి అవగాహన కల్పించడమే ఈ పోటీల ముఖ్య ఉద్దేశ్యమని అధికారులు తెలిపారు.
పోలీస్ శాఖ మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, ఎల్లవేళలా పోలీస్ సిబ్బంది సహాయ, సహకారాలు ఉంటాయని పోలీస్ అధికారులు తెలియజేశారు. జిల్లా మహిళా రక్షక్ టీం యొక్క సేవలు జిల్లాలో ప్రతి మహిళలకు అందుబాటులో అందుబాటులో ఉంచామన్నారు.
మహిళలు/చిన్నారులకు అత్యవసర సమయంలో సహాయం కొరకు హెల్ప్‌లైన్ నెంబర్లు చైల్డ్ హెల్ప్ లైన్:1098, ఉమెన్ హెల్ప్ లైన్:181, పోలీస్ హెల్ప్ లైన్: 112, సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్:1930 , నెంబర్లకు కాల్ చేసి పోలీసుల సహాయం పొందాలని తెలియజేశారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








