నారద వర్తమాన సమాచారం
గంజాయి మహమ్మారిని కూకటి వేళ్ళతో సహా పెకిలించాలని అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే గల్లా మాధవి .
గుంటూరు
ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో గంజాయి మహమ్మారిని కూకటి వేళ్ళతో సహా పెకలించి వేయాలని, మాదక ద్రవ్యాల వినియోగంను కట్టడి చేయాలని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి కోరారు. సోమవారం అసెంబ్లీలో ప్రస్నోత్తరాల సమయంలో మాదక ద్రవ్యాల అంశాన్ని గళ్ళా మాధవి లేవనెత్తారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత మాదక ద్రవ్యాల మీద ఉక్కు పాదం మోపటం జరిగినది.అయిన కూడా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో చిన్నచిన్న దుకాణాల్లో మైనర్లకు కూడా దీనిని అధికంగా విక్రయిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో యువతకు స్కిల్ల్ సెంటర్ లు ఏర్పాటు, కొత్త పరిశ్రమల ఏర్పాటుతో ఉద్యోగ కల్పన కోసం కృషి చేసే ఎన్డీయే కూటమి ఒక వైపు ఉంటె, భారతదేశ దశ, దిశని మార్చే యువత జీవితాన్ని రీహాబిటేషన్ సెంటర్, డిఅడిక్షన్ సెంటర్లకు వెళ్ళే రోగులుగా మార్చి వారి జీవితాన్ని నాశనం చేసిన వైసిపి ఇంకో వైపు ఉన్నది ఆని మన టిడిపి హయాంలో చెక్ పోస్టుల ఏర్పాటు, శివారు ప్రాంతాల్లో పోలిస్ పెట్రోలింగ్ ఉండేది, గడిచిన 5 ఏళ్ళలో ఈ వ్యవస్థ నిర్వీర్యం అయిపొయింది. మా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అర్బన్ ప్రాంతం కావటం వలన వివిధ ప్రాంతాల వారు దీనిని అడ్డాగా చేసుకొని గంజాయి మరియు మాదక ద్రవ్యాలను సరఫరాతో పాటు యువతకు విక్రయిస్తున్నారు. పోలీసులు కూడా వారిని అరెస్టులు చేస్తున్న పరిస్థితి ఉంది కనుక హోం మంత్రి మా నియోజకవర్గంలో సిసి కెమెరాలు ఏర్పాటు చేయటంతో పాటు, నిర్వీర్యమయిన పోలిస్ పెట్రోలింగ్, చెక్ పోస్టులను తిరిగి పునరుద్ధరించాలని కోరుతున్నాను.
హోం మంత్రి అనిత సమాధానం ఇస్తూ…
వైసిపి హయాంలో 11 వేల ఎకరాలు ఉన్న గంజాయి సాగుని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉక్కు పాదం మోపి 100 ఎకరాలకు తీసుకొని వచ్చాము. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత చంద్రబాబునాయుడు ఈగల్ టీం ను ఏర్పాటు చేసి గంజాయి మీద ఉక్కు పాదం మోపాము. దీనిని సమూలంగా రూపుమాపుతమని, అలాగే మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టటం కోసం ప్రత్యెక చర్యలు తీసుకున్నాము. ఇప్పటికే అనేక కేసులు నమోదు చేసాము. కాబట్టి సభ్యులు గళ్ళా మాధవి సభ దృష్టికి తీసుకొచ్చిన అంశాలను పరిశిలించి, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హోం మంత్రి అనిత హామీనిచ్చారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.