నారద వర్తమాన సమాచారం
వెంటిలేటర్ పై ఉన్న టెక్స్ టైల్ రంగాన్ని ఆదుకోండి. ప్రభుత్వాన్ని మోసగించిన జ్ఞానేశ్వర సంస్థను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి : మాజీమంత్రి ప్రత్తిపాటి
మున్సిపాలీటీల్లో గ్రామాలవిలీనంపై గత ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించింది.
రాష్ట్రంలో కాటన్ అనుబంధ పరిశ్రమలకు పవర్ సబ్సిడీలు ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను : పుల్లారావు.
గుజరాత్, మధ్యప్రదేశ్, మధ్యప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, చత్తీస్ ఘడ్ రాష్ట్రాలు పవర్ సబ్సిడీలు ఇస్తున్నాయి.
2 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న పరిశ్రమను బతికించకపోతే ప్రభుత్వం నష్టపోతుంది.
జ్ఞానేశ్వర ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ బయోమైనింగ్ పేరుతో చెత్త సేకరణ టెండర్లు దక్కించుకొని పనులు చేయకుండా డబ్బులు డ్రా చేసుకొంది.సదరు సంస్థను బ్లాక్ లిస్ట్ లో పెట్టి, ప్రభుత్వం నుంచి డ్రా చేసుకున్న సొమ్మును రికవరీ చేయాలని కోరుతున్నా : ప్రత్తిపాటి.
సదరు సంస్థను బ్లాక్ లిస్ట్ లో పెట్టి, ప్రభుత్వం నుంచి డ్రా చేసుకున్న సొమ్మును రికవరీ చేయాలని కోరుతున్నా : ప్రత్తిపాటి.
మున్సిపాలిటీల్లో గ్రామాల విలీనానికి సంబంధించిన జీవోపై రాష్ట్రంలో పలుచోట్ల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైందని, గత ప్రభుత్వం అనాలోచితంగా, స్థానికుల అభిప్రాయాలకు విరుద్ధంగా విలీనప్రక్రియ చేపట్టిందని, వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్ర టెక్స్ టైల్ రంగానికి పవర్ సబ్సిడీలు ఇచ్చి ఆదుకోవాలని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు కోరారు.
బుధవారం ఆయన అసెంబ్లీలో పురపాలికల్లో గ్రామాల విలీనం, రాష్ట్ర టెక్స్ టైల్ రంగ దుస్థితిపై మాట్లాడుతూ, ప్రభుత్వానికి పలు కీలక సూచనలు చేశారు.
“ చిలకలూరిపేట మున్సిపాలిటీలో కొన్ని గ్రామాలను నిబంధనలకు విరుద్ధంగా విలీనం చేశారు. పసుమర్రు, మానుకొండవారిపాలెం, గణపవరం గ్రామస్తులు విలీనాన్ని ఏకపక్షంగా తిరస్కరించారు. ఈ సమస్యను గౌరవ మంత్రివర్యులు వెంటనే పరిష్కరించాలని కోరుతున్నాం.
అమృత్ పథకం తొలిదశలో అసంపూర్తిగా నిలిచిపోయిన పనుల్ని అమృత్-2లో పూర్తిచేయాలి.
మున్సిపల్ శాఖా మంత్రిగా నారాయణ బాధ్యతలు చేపట్టాక మున్సిపాలిటీలు గాడిలో పడ్డాయి. అమృత్-1 పథకం పనులు కొన్నిచోట్ల అసంపూర్తిగా నిలిచిపోయాయని, అమృత్ -2 పథకంలో అయినా ఆ పనులన్నీ త్వరగా పూర్తి అయ్యేలా చూడాలని కోరుతున్నాను. ఇటీవల 01-04-2025 నుంచి బిల్లులచెల్లింపును నేరుగా మున్సిపాలిటీలే చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం శుభపరిణామం. ఈ నిర్ణయం వల్ల అభివృద్ధి పనులు వేగంగా జరుగుతా యి. చిలకలూరిపేటలో గాంధీపార్క్ ను కూడా గతప్రభుత్వం తాకట్టు పెట్టింది. అభివృద్ధి ఆపేసి ఆ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన మంత్రి ప్రజల్ని దోచుకోవడమే పనిగా పెట్టుకు న్నారు.
బయో మైనింగ్ టెండర్లు దక్కించుకొని పనులు చేయకుండా డబ్బులు డ్రా చేసుకున్న జ్ఞానేశ్వర ఇంజనీరింగ్ సంస్థను ప్రభుత్వం బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి
జ్ఞానేశ్వర ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ బయోమైనింగ్ పేరుతో టెండర్లు రాష్ట్రవ్యాప్తంగా కిలో చెత్తకు రూ.7.50లు చొప్పున టెండర్లు దక్కించుకొంది. రూ.50కోట్లకు మాత్రమే పనులు చేసి, బయో మైనింగ్ చేయకుండా చెత్తను డంపింగ్ యార్డులకే పరిమితం చేశారు. మంగళగిరి మున్సిపాలిటీ పరిధిలోని తాడేపల్లిలో రూ.17కోట్లు డ్రా చేశారు. కొందరు అధికారులు కూడా ఈ సంస్థకు సహాయసహకారాలు అందించారు. ఈజీ మనీకి అలవాటుపడిన ఈ సంస్థను తక్షణమే బ్లాక్ లిస్ట్ లో పెట్టి, పనులు చేయకుండా చేసినట్టుగా డబ్బులు డ్రా చేసుకున్నందున ఆ సొమ్మును రికవరీ చేయాలని కోరుతున్నాను. మదనపల్లి, బద్వేల్, శ్రీకాకుళం మున్సిపాలిటీల్లో బిల్లులు డ్రా చేసుకునే ప్రయత్నాలు సదరు సంస్థ చేస్తోంది. సమాజానికే ప్రమాదకరమైన కంపెనీ జ్ఞానేశ్వర సంస్థ, అలాంటి వాటిని ప్రోత్సహించడం మంచిదికాదు.
వెంటిలేటర్ పై ఉన్న టెక్స్ టైల్ రంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే..
టెక్స్ టైల్ రంగం వెంటిలేటర్ పై ఉందని, ఆ రంగాన్ని కాపాడే బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రిపై ఉంది. స్పిన్నింగ్, వీవింగ్, ప్రెస్సింగ్, జిన్నింగ్ వంటి కాటన్ రిలేటెడ్ ఇండస్ట్రీ మొత్తం నేడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర నష్టాలలో కూరుకుపోయింది. తెలంగాణ, తమిళనా డు, గుజరాత్, ఉత్తరప్రదేశ్, చత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కాటన్ ఇండస్ట్రీస్ కు పవర్ సబ్సిడీలు ఇస్తున్నారు. అదేవిధమైన ఆలోచన కూటమిప్రభుత్వం చేయాలని కోరుతున్నాం. ఈ రంగంపై ఆధారపడి 2లక్షల మంది బతుకుతున్నారు. కాబట్టి ఈ సమస్యపై విద్యుత్ శాఖ మంత్రి ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరుతున్నాం. ప్రభుత్వం స్పందించకపోతే, టెక్స్ టైల్ రంగం మొత్తం మూతపడే ప్రమాదముంది. ఇప్పటికే చాలా చోట్ల కంపెనీలు నష్టాలను తట్టుకోలేక మూసివేత దిశగా నడుస్తున్నాయి” అని ప్రత్తిపాటి సభసాక్షిగా వాస్తవాలు తెలియచేశారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.