నారద వర్తమాన సమాచారం
ప్రకృతి వ్యవసాయ వార్షిక కార్యచరణ ప్రణాళిక( 2025) పై సిబ్బందికి శిక్షణ!
ప్రకృతి వ్యవసాయం చేద్దాం – ప్రజలందరికీ ఆరోగ్యాన్ని పంచుదాం పల్నాడు జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కే.అమల కుమారి.
నరసరావుపేట.
ప్రకృతి వ్యవసాయ 2025 వార్షిక కార్యచరణ ప్రణాళికలో పల్నాడు జిల్లాలోని ప్రకృతి వ్యవసాయ విధానాలు పాటిస్తున్నటువంటి గ్రామాల్లోని రైతులు ప్రతి ఒక్కరూ ఈ ప్రణాళికలో భాగస్వామ్యం కావాలని పల్నాడు జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కే.అమలకుమారి అన్నారు. గురువారం నరసరావుపేట రావిపాడు రోడ్డు లోని బృందావనంలో రెండవ రోజు సత్తెనపల్లి, నరసరావుపేట, పిడుగురాళ్ల, సబ్ డివిజన్లోని సిబ్బందికి శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ టి.విజయ్ కుమార్ జూమ్ వీడియో కాల్ ద్వారా సిబ్బందితో మాట్లాడుతూ ప్రస్తుతం వాతావరణం ప్రకారం భూమి అనారోగ్యానికి గురై, రసాయనక ఆహారం తింటూ ప్రజలందరూ అనారోగ్యానికి మారుతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్లో ఈ పరిస్థితిని అధికమించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టినటువంటి జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ (APCNF) విధానంలో రైతులు పంటల సాగు చేయటమే శరణ్యంగా మారిందని, అదేవిధంగా భూమి ఆరోగ్యంగా ఉంటే పంట కూడా ఆరోగ్యంగా ఉంటుందని అన్నారు. గ్రామాల్లో ఉన్న రైతులు విస్తీర్ణం మొత్తం పిఎండిఎస్ (ఫ్రీ మాన్ డ్రై సోయింగ్ ) 31 రకాల విత్తనాలను వారి పొలంలో సాగు చేసుకునే విధానం గా ప్రతి ఒక్క సిబ్బంది రైతులను మార్చే దిశగా కృషి చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమానికి స్టేట్ రిసోర్స్ పర్సన్ రాంచంద్రన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయ రైతులు సాగు చేసే విధి విధానాలు, వరి,ప్రత్తి మిరప, కంది,మొక్కజొన్న, కూరగాయలు మొదలగు పంటలలో రైతులు ప్రధాన పంటతో పాటు ఐదు రకాల అంతర పంటలు వేయాలని అంతర పంటలు వేయటం వలన అదనపు ఆదాయము, ప్రధాన పంటకు కావాల్సిన సూక్ష్మ పోషకాలు అభివృద్ధి చెంది ప్రధాన పంట ఆరోగ్యంగా ఉండి పంట దిగుబడి పెరిగే రైతుకు లాభదాయకంగా ఉంటుందని తెలిపారు. పల్నాడు జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కే.అమల కుమారి మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయ 2025 కార్యచరణ ప్రణాళికలో భాగంగా ప్రతి ఒక్క సిబ్బంది మీయొక్క గ్రామాలలో రైతుల భూమి విస్తీర్ణం, పంట, పశువులు, వివరాలను నమోదు చేసుకోవాలని, రైతు సేవా కేంద్రం నందు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నటువంటి రైతుల వివరాలను సేవా కేంద్రంలో ఉంచాలన్నారు. ఖరీఫ్ ప్రణాళికలో భాగంగా గ్రామాల్లోని ప్రతి ఒక్క రైతు 31 రకాల విత్తనాలను తమ పొలంలో వేసుకునే విధంగా చూడవలసిన బాధ్యత ప్రతి ఒక్క సిబ్బందిపై ఉందని అదేవిధంగా విత్తనాలు సాగువలన వారికి కలిగే లాభాలను రైతులకు వివరించాలని ఆమె తెలియజేశారు. పల్నాడు జిల్లా అడిషనల్ డిపిఎం ప్రేమ్ రాజ్ మాట్లాడుతూ ప్రతి ఒక్క గ్రామ సంఘం పరిధిలో ఎన్పీయం షాపు ఉండే విధంగా చూడాలని, గ్రామాల్లోని రైతులకు కావాల్సిన ఇన్పుట్స్ ఖరీఫ్ ముందుగానే సిద్ధం చేసుకోవాలని, పిఎండిఎస్ విత్తనాల కొరకు మహిళా సంఘాల ద్వారా లోన్లు ఇప్పిచ్చడం జరుగుతుందని, సిబ్బందికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్టేట్ ఎన్ఎఫ్ఏలు మన్విత, లక్ష్మి, జిల్లా శిక్షకుడు సైదయ్య, ఎన్ఎఫ్ఏలు నందకుమార్, సౌజన్య,అప్పలరాజు, మేరీ, మాస్టర్ ట్రైనర్లు సిబ్బంది పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.