నారద వర్తమాన సమాచారం
రీ – సర్వే, రెవెన్యూ, సివిల్ సప్లయిస్ విషయాలపై కలెక్టరేట్ లో పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ గనోరే వీడియో కాన్ఫరెన్స్
పల్నాడు జిల్లా,
పల్నాడు జిల్లాకు సంబంధించి ఆయా మండలాల్లో జరుగుతున్న రీ – సర్వే పనులు ఏ విధంగా జరుగుచున్నది. ఆయా మండలాల్లోని రెవెన్యూ సమస్యలు, సివిల్ సప్లయిస్ విషయాలపై పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ గనోరే పల్నాడు కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో రీ – సర్వే పనులు జరుగుతున్న తీరు ను అడిగి తెలుసు కున్నారు.
రైతులను పిలిపించుకొని రీ – సర్వే కొలతలు,హద్దు రాళ్ళు, బౌండరీలు సక్రమంగా చేపట్టాలని, ఎవరిని నొప్పించ వద్దని, అందరితో సక్రమంగా మాట్లాడాలని సూచించారు.
రెవిన్యూ విషయాల్లో ఎలాంటి ఇబ్బందులు ఉన్న వెంటనే విషయాన్ని ఆర్డీవో,తహశీల్దార్, లేదా ఏడి సర్వేయర్ తో చర్చించాల్సి ఉందన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో ప్రతి నెల ఒకటో తేదీ నుండి 20వ తేదీ వరకు పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం, నిత్యవసర సరుకులు ఎప్పటికప్పుడు వివరాలను నమోదు చేసి, పంపిణీ జరుగుతున్న కేంద్రాలలో ఏం.యు.డి వాహనాల దారులు నుంచి, రేషన్ డీలర్ల దాకా అన్ని సక్రమంగా జరిగేలా చూడాలని ఆదేశించారు.
కలెక్టరేట్ లోని ఎస్.ఆర్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ కాలు నుంచి జిల్లాలోని డీఎస్ఓ, మూడు రెవెన్యూ డివిజన్ లో ఉన్న ఆర్డీవోలు,అన్ని మండలాల తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దారులు, ఆయా మండలాల సర్వేయర్లు,వీఆర్వోలు తో మాట్లాడారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.